UK Political Crisis: యూకేలో రిషీ సునాక్ మేనియా.. స్పెక్యులేటివ్ మార్కెట్‌లో బెట్టింగ్ సునామీ.. ఏ స్థాయిలో సాగుతుందంటే..
భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధానమంత్రి పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ఆయనతో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీ పడుతున్నారు. అయితే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు ప్రముఖ నేతల మధ్య డీల్ కుదిరినట్లు తెలుస్తోంది.
బ్రిటన్ కొత్త ప్రధాని చర్చ ఆ దేశంలో రచ్చ రేపుతోంది. బ్రిటన్ ప్రధాని పదవి జాబితాలోకి భారత సంతతికి చెందిన రిషీ సునాక్ పేరు సునామీలా ముందుకొచ్చింది. రావడమే కాదు. ఆయనే బ్రిటన్ కాబోయే ప్రధాని అన్న వాదనలూ… ఆయనకు 100 మంది ఎంపీల మద్దతుందన్న ఊహాగానాలూ తెరపైకి వచ్చాయి. అసలింతకీ బ్రిటన్ కన్జర్వేటివ్ పార్టీలో ఎవరి మద్దతు ఎంత అనేదానిపై విభిన్న వాదనలు చక్కర్లు కొడుతున్నాయి. బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టిన లిజ్ ట్రస్ అతి స్వల్ప కాలంలోనే, 45 రోజులు తిరక్కుండా దిగిపోవాల్సి రావడంతో ఆ దేశం రాజకీయ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. లిజ్ ట్రస్ గద్దె దిగకముందే బ్రిటన్‌లో వాట్ నెక్స్ట్ అన్న ప్రశ్న ప్రపంచరాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. దీంతో తెరపైకి వచ్చిన మొట్టమొదటి పేరు భారతీయ సంతతికి చెందిన రిషీ సునాక్. రెండ్రోజులు తిరక్కుండానే బ్రిటన్ మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పేరు తెరపైకి వచ్చింది. రిషీ సునాక్‌కి చెక్ పెట్టేందుకు విహారయాత్రలో ఉన్న బోరిస్… ఉన్నపళంగా బ్రిటన్ చేరుకుని, ప్రైమ్‌మినిస్టర్ పోస్టు కోసం లాబీయింగ్ మొదలు పెట్టారు. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలనీ, పోటీలో ఉండొద్దని రిషీ సునాక్‌ని బోరిస్ జాన్సన్ కోరినట్టు వార్తలొచ్చాయి. మరోవైపు ప్రధాని పదవికి పోటీపడబోయే వారిలో బోరిస్ జాన్సన్‌తో పాటు మరో ఇద్దరిముగ్గురి పేర్లు తెరపైకి వచ్చాయి.
ప్రస్తుత రాజకీయ సమీకరణాల ప్రకారం, భారత సంతతికి చెందిన రిషి సునక్ ప్రధానమంత్రి పదవి రేసులో ముందంజలో ఉన్నారు. ఆయనతో మాజీ ప్రధాని బోరిస్ జాన్సన్ పోటీ పడుతున్నారు. అయితే కన్జర్వేటివ్ పార్టీకి చెందిన ఈ ఇద్దరు ప్రముఖ నేతల మధ్య డీల్ కుదిరినట్లు తెలుస్తోంది. శనివారం నుంచి రిషి సునక్, జాన్సన్ మధ్య చర్చల రౌండ్ జరుగుతోంది. మీడియా నివేదికల ప్రకారం, ఇద్దరూ కూడా ఒక ముగింపుకు చేరుకున్నారు. వాస్తవానికి, ఎంపీలు ఇప్పుడు రిషి సునక్‌కు బహిరంగంగా మద్దతు ఇవ్వడం ప్రారంభించారు.
జాన్సన్ మద్దతుదారులు కొందరు అతని వద్ద తగిన సంఖ్యలో బలగాలు ఉన్నాయని పేర్కొన్నారు. జాన్సన్ సన్నిహితుడు సర్ జేమ్స్ డుడ్రిడ్జ్ మీడియా ముందుకు వచ్చి బోరిస్ జాన్సన్‌కు 100 మంది ఎంపీల మద్దతు ఉందని, అయితే రిషి సునక్ మద్దతు ఉన్న రిచర్డ్ హోల్డెన్ ఈ వాదనను తిరస్కరించారు.
డీల్‌కు బ్రేక్ పడిందా..?
అయితే కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష పదవికీ.. అటు తర్వాత బ్రిటన్ ప్రధాని పదవిని చేపట్టాలంటే కనీసం 100 మంది పార్టీ ఎంపీల మద్దతు ఉండాలి. రిషీ సునాక్‌కి 100 మంది ఎంపీల మద్దతున్నట్లు ఆయన మద్దతుదారులు చెపుతున్నారు. అయితే దాంట్లో ఎంత వాస్తవముంది అనేది ఎవ్వరి ఆలోచనలకీ అందని విషయం. అందుకే బీబీసీ ఓ సర్వే చేసింది. ఆ సర్వేలో రిషి సునాక్‌కి 44 మంది ఎంపీలు, బోరిస్ జాన్సన్‌కి 23 మంది ఎంపీలూ, పెన్నీ మార్డౌంట్ అనే మరో ప్రధాని పోటీదారుకి 16 మంది ఎంపీల మద్దతున్నట్టు తెలుస్తోంది.
ఇప్పటి వరకు అందిన సమాాచం ప్రకారం రిషి సునక్, జాన్సన్ కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఇద్దరు నేతలు అభ్యర్థిత్వాన్ని ప్రకటించలేదు.. అయితే ఇద్దరు నేతలు ఉమ్మడి టిక్కెట్‌పై అంగీకరించినట్లు మీడియాలో కథనాలు వస్తున్నాయి. అదే సమయంలో టోరీ చట్టసభ సభ్యులు తమ విభేదాలను పక్కనబెట్టి ఒక తీర్మానానికి రావాలని ఇద్దరు నేతలకు పిలుపునిచ్చారు. ఒకరిని ప్రధానిగా, మరొకరిని కేబినెట్‌లో సీనియర్ హోదాలో ఉండేలా డీల్ ఖరారు చేయాలని టోరీ చట్టసభ సభ్యులు కోరినట్లుగా తెలుస్తోంది.
ఎవరి మద్దతు ఎంత?
ప్రస్తుతం రిషి సునక్‌కు 126 మంది, జాన్సన్‌కు 54 మంది, పెన్నీ మోర్డెంట్‌కు 24 మంది సభ్యులు ఉన్నారని గార్డియన్‌ని ఉటంకిస్తూ వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అదే సమయంలో సునక్‌కు 128, జాన్సన్‌కు 53, మోర్డెంట్‌కు 23 మంది సభ్యుల సపోర్ట్ ఉన్నట్లుగా బ్రిటన్ మీడియా కథనాలను ప్రచూరించింది. ఇప్పుడు మాజీ ప్రధాని జాన్సన్ సంఖ్యలను సేకరించడానికి సభ్యులను చేరుకున్నారు. అయితే ప్రస్తుత లెక్కల ప్రకారం 42 ఏళ్ల సునక్ ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రిషి సునక్‌పై బెట్టింగ్
ఇప్పుడు తదుపరి ప్రధానికి సంబంధించి స్పెక్యులేటివ్ మార్కెట్‌లో హాట్ హాట్ చర్చ జరుగుతోంది. త్వరలో లిజ్ ట్రస్ ప్రభుత్వం కథ ముగుస్తుందని.., రిషి సునక్ తదుపరి ప్రధానమంత్రి కావచ్చని నమ్ముతారు. లిజ్ ట్రస్ రాజీనామా చేసినప్పటి నుంచి తదుపరి ప్రధానమంత్రిగా రిషి సునక్ అంటూ ప్రచారం మొదలైంది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా, 10 డౌనింగ్ స్ట్రీట్‌లో రిషి సునక్‌కి పట్టాభిషేకం చేయవచ్చని ఊహాగానాలు బెట్టింగ్ చేస్తున్నారు. ఇప్పుడు లిజ్ ట్రస్ తర్వాత రిషి సునక్ ప్రధానమంత్రి పదవికి అత్యంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తి అని ‘oddschecker’ బుకీల ‘అసమానత అగ్రిగేటర్’ చూపించింది. కోట్ల డాలర్ల బెట్టింగ్ కొనసాగుతోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం