AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Global Summit: ప్రపంచంలో శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ: టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్

ప్రపంచంలో శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ అంటూ టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ కొనియాడారు.. జర్మనీలోని ప్రముఖ స్టట్‌గార్ట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ కీలక వ్యాఖ్యలు చేశారు.

News9 Global Summit: ప్రపంచంలో శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ: టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్
TV9 Network MD & CEO Barun Das
Shaik Madar Saheb
|

Updated on: Nov 22, 2024 | 10:04 PM

Share

ప్రపంచంలో శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ అంటూ టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ కొనియాడారు.. జర్మనీలోని ప్రముఖ స్టట్‌గార్ట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ రెండో రోజున టీవీ9 నెట్‌వర్క్ ఎండీ, సీఈవో బరుణ్ దాస్ మాట్లాడుతూ.. ప్రపంచంలో శాంతి, అభివృద్ధికి పాటుపడే వ్యక్తి ప్రధాని మోదీ.. ఆయనకంటూ ఓ ప్రత్యేకను గుర్తింపును సంపాదించుకుని ప్రపంచ నేతగా ఎదిగారంటూ పేర్కొన్నారు. RRR అంటే రిలేషన్ షిప్, రెస్పెక్ట్ అండ్ రెస్పాన్సిబిలిటీకి సంబంధించి ప్రధాని మోదీ వ్యక్తిత్వం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిందని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రెండో రోజు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించడానికి ముందు బరుణ్ దాస్ మాట్లాడారు.

ఈ గ్లోబల్ సమ్మిట్ వేడుకలో పాల్గొనే అతిథి వక్తలు ముందుకు తెచ్చిన సూచనలు..  వ్యక్తం చేసిన ఆలోచనలు భవిష్యత్తును మెరుగుపరుస్తాయని బరుణ్ దాస్ అన్నారు. వీటిని అవలంబించడం ద్వారా మనం ప్రపంచంలో కొత్త శిఖరాలను అందుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా, సంవత్సరం ప్రారంభంలో న్యూఢిల్లీలో ఏర్పాటు చేసిన TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే సమ్మిట్‌లో ప్రధాని మోదీ పాల్గొనడం.. ఆయన చేసిన ప్రసంగాన్ని ప్రస్తావించారు. ప్రధాని మోదీ వ్యక్తిత్వం నుంచి మూడు ముఖ్యమైన విషయాలు నేర్చుకున్నామన్నారు – సుపరిపాలన, బహుముఖంగా ఉండటం.. మూడవది, దేశం స్థితిని మెరుగుపరచడం.. అని పేర్కొన్నారు.

ప్రధాని మోదీ వ్యక్తిత్వం నుంచి తాను నేర్చుకున్న పాఠం కొన్ని నెలల క్రితమేనని, అయితే ఈరోజు ఆయన వ్యక్తిత్వంలో ఆర్‌ఆర్‌ఆర్‌ మెరుపును చూస్తున్నానని బరుణ్ దాస్‌ అన్నారు. RRR అనేది గత సంవత్సరం ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌గా ఆస్కార్‌ను గెలుచుకున్న ఒక ప్రసిద్ధ చిత్రం పేరన్నారు. కానీ తనకు దాని కంటే ఇది చాలా ఎక్కువ అన్నారు.. తనకు RRR అనేది ప్రపంచానికి శాంతియుతమైన, సామరస్యపూర్వకమైన భవిష్యత్తును సృష్టించే ఫార్ములా అని చెప్పారన్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోదీ వ్యక్తిత్వం నుంచి తాను నేర్చుకున్న ఆర్‌ఆర్‌ఆర్‌ని కొత్త మార్గంలో అర్థం చేసుకునే స్వేచ్ఛ ఈ రోజు తనకు కావాలని కోరుకుంటున్నాను అని బరుణ్ దాస్ అన్నారు. అతను మొదటి R – సంబంధం అని చెప్పారన్నారు. ప్రపంచంలోని ఏ దేశంతోనైనా మెరుగైన సంబంధాలను నెలకొల్పగల సామర్థ్యం ప్రధాని మోదీకి ఉందన్నారు. అతని స్నేహపూర్వక ప్రవర్తన ప్రపంచాన్ని కూడా ఆకట్టుకుందన్నారు. ప్రధాని మోదీ మాస్కో నుంచి కీవ్‌ వరకు, ఇజ్రాయెల్‌ నుంచి పాలస్తీనా వరకు సత్సంబంధాలు కొనసాగిస్తున్నారని చెప్పారు. ప్రపంచం ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్ల మధ్య మానవత్వం అత్యంత ముఖ్యమైనదని ప్రధాని మోదీ అభివర్ణించారు.. ఎల్లప్పుడూ శాంతి సందేశాన్ని ఇచ్చారని కొనియాడారు.

సెకండ్ ఆర్ అంటే రెస్పెక్ట్ ( గౌరవం ) అని బరుణ్ దాస్ అన్నారు. ప్రధాని మోదీ ఎవరితోనైనా సంబంధాలను ముందుకు తీసుకెళ్లినప్పుడు గౌరవానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తారని అన్నారు. మానవత్వం గొప్ప బలం సమష్టి కృషిలో ఉందని, వివాదంలో కాదని ఆయన అన్నారు. ఇది మొత్తం ప్రపంచానికి సూచన. ఇది యుద్ధానికి సమయం కాదని, శాంతి, సామరస్యం, ప్రగతికి సమయం అని ప్రధాని మోదీ ఎప్పుడూ ఉద్ఘాటిస్తున్నారని అన్నారు.

దీని తరువాత అతను మూడవ R – బాధ్యత (రెస్పాన్సబిలిటీ) అర్థాన్ని వివరించారు.. ప్రధాని మోదీ నాయకత్వంలో ఇది మూడో మంత్రంగా తాను  భావిస్తున్నాని అని బరుణ్ దాస్ అన్నారు. ప్రధాని మోదీ విదేశాంగ విధానంలో మానవాళికి రక్షణ ముఖ్యమని, మానవీయ విలువల గౌరవాన్ని కాపాడేందుకు ఆయన ఎప్పుడూ ముందుంటారని అన్నారు. అతని నాయకత్వంలో, భారతదేశం ప్రపంచంలో శాంతి దృక్పథాన్ని వ్యాప్తి చేస్తుందన్నారు.

దీనితో పాటు, ఆహ్వానాన్ని అంగీకరించి, న్యూస్9 గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించడం పట్ల ప్రధాని మోడీకి ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు అంటూ పేర్కొన్నారు. ప్రధాని మోదీ తన బిజీ షెడ్యూల్ మధ్య తన విలువైన సమయాన్ని తమ కోసం వెచ్చించారని అన్నారు. ఈ రోజు మరోసారి ఆయన ప్రసంగం శాంతి – పురోగతికి సంబంధించిన ప్రపంచ దృష్టిని ప్రోత్సహిస్తుంది.. ఆకర్షిస్తుందని పేర్కొన్నారు.

వీడియో చూడండి..

మరిన్ని న్యూస్‌ 9 గ్లోబల్‌ సమిట్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి