Rebecca Cheptegei: పారిస్ ఒలింపిక్ క్రీడాకారిణి రెబెక్కాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..చికిత్స పొందుతూ మృతి

రెబెక్కా చెప్టేగై హత్య కారణంగా ఉగాండాలో శోకం అలముకుంది. ఆమె మాజీ ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెబెక్కా మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్య చేసిన నిందితుడిని శిక్షించి రెబెక్కా కు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

Rebecca Cheptegei: పారిస్ ఒలింపిక్ క్రీడాకారిణి రెబెక్కాపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ప్రియుడు..చికిత్స పొందుతూ మృతి
Rebecca CheptegeiImage Credit source: REUTERS/Dylan
Follow us

|

Updated on: Sep 06, 2024 | 2:39 PM

పారిస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఉగాండా క్రీడాకారిణి  33 ఏళ్ల రెబెక్కా చెప్టెగీ గురువారం విషాదకరంగా మరణించింది. రెబెక్కా ప్రియుడు ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో రెబెక్కా శరీరం 75 శాతానికి పైగా కాలిపోయింది. రెబెక్కా కెన్యాలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించింది.

చెప్టెగీ పై ఆదివారం రోజున దాడి జరగగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నాలుగు రోజుల తర్వాత అంటే  గురువారం మరణించిందని  కెన్యా , ఉగాండా మీడియా నివేదించింది.

ఇవి కూడా చదవండి

రెబెక్కా చెప్టెగై 2024 పారిస్ ఒలింపిక్స్‌లో 44వ స్థానంలో నిలిచింది. దేశానికి ఆశాకిరణంగా మారుతున్న తరుణంలో ఆమె మాజీ ప్రియుడు ఆమె కలలను నాశనం చేశాడు. రెబెక్కా చెప్టేగై హత్య కారణంగా ఉగాండాలో శోకం అలముకుంది. ఆమె మాజీ ప్రియుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రెబెక్కా మరణంతో ఆమె కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హత్య చేసిన నిందితుడిని శిక్షించి రెబెక్కా కు న్యాయం చేయాలనీ డిమాండ్ చేస్తున్నారు.

ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు ఏం చెప్పారు?

ఈ సంఘటనపై ఉగాండా ఒలింపిక్ కమిటీ అధ్యక్షుడు డొనాల్డ్ రుకారే సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ మన ఒలింపిక్ అథ్లెట్ రెబెక్కా చెప్టేగై ఇక లేరు అనే బాధాకరమైన వార్త మాకు అందింది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని చెప్పారు.

ఇద్దరి మధ్య కొనసాగుతున్న వివాదం

భూమి విషయంలో క్రీడాకారిణికి, ఆమె మాజీ ప్రియుడికి మధ్య వివాదం నడుస్తోందని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వ్యవహారంపై ఇంకా విచారణ కొనసాగుతోంది. చెప్టేగై తండ్రి జోసెఫ్ తన కుమార్తెకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

గత ఏడాది జరిగిన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో రెబెక్కా 14వ స్థానంలో నిలిచింది. అదే సమయంలో 2022 సంవత్సరంలో థాయ్‌లాండ్‌లో జరిగిన వరల్డ్ మౌంటైన్ , ట్రైల్ రన్నింగ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌ను గెలుచుకుంది రెబెక్కా.

మరిని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..