Israel-Gaza: గాజా సొరంగంలో బందీల మృతదేహాలు.. అతి దారుణంగా చంపేసిన హమాస్.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా సోమవారం ఇజ్రాయెల్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల విరమణకు అంగీకరించాలని, హమాస్ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్ వీధుల్లో ఆందోళనకారులు కదం తొక్కారు. హమాస్ చెరలో ఉన్న వారిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. రఫా నగరంలో ఇజ్రాయెల్ దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో వీరి మృతదేహాలను గుర్తించారు.
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు వ్యతిరేకంగా సోమవారం ఇజ్రాయెల్‌లో భారీ ప్రదర్శనలు జరిగాయి. కాల్పుల విరమణకు అంగీకరించాలని, హమాస్ చెరలోని బందీలను సురక్షితంగా రప్పించాలని డిమాండ్ చేస్తూ టెల్ అవీవ్ వీధుల్లో ఆందోళనకారులు కదం తొక్కారు. హమాస్ చెరలో ఉన్న వారిలో ఆరుగురి మృతదేహాలు లభ్యమయ్యాయి. రఫా నగరంలో ఇజ్రాయెల్ దళాలు చేపట్టిన ఆపరేషన్‌లో వీరి మృతదేహాలను గుర్తించారు. వీరిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. ఇజ్రాయెల్ దళాలు అక్కడకు వెళ్లడానికి కొద్ది గంటల ముందే హమాస్ ఉగ్రవాదులు.. ఆ బందీలను అతి కిరాతకంగా చంపేసినట్లు ప్రాథమికంగా నిర్ధరించారు. గతేడాది అక్టోబరు 7న ఇజ్రాయెల్‌పై జరిపిన మెరుపు దాడి సమయంలో హమాస్ వీరిని బంధించారు. అప్పటి నుంచి వీరిని చిత్రహింసలకు గురిచేసి ఉంటారని అనుమానిస్తున్నారు. దాంతో నెతన్యాహు ప్రభుత్వంపై ఇజ్రాయెల్ వ్యాప్తంగా ఆగ్రహం పెరుగుతోంది.
కార్మిక సంఘం హిస్టాడ్రుట్ ఇచ్చిన ఒక రోజు సమ్మె పిలుపునకు సోమవారం వైద్యులు, బ్యాంకు ఉద్యోగులు, ప్రభుత్వ సిబ్బందితో పాటు విపక్ష నేతలూ పాల్గొన్నారు. అయితే ఈ సమ్మె రాజకీయ ప్రేరేపితమంటూ ప్రభుత్వం లేబర్ కోర్టును ఆశ్రయించింది. మధ్యాహ్నం 2.30 గంటలకల్లా సమ్మె విరమించాలని కార్మిక సంఘాన్ని కోర్టు ఆదేశించింది. సమ్మెపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది పరోక్షంగా హమాస్‌కు మద్దతివ్వడమేనంటూ ధ్వజమెత్తారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.