Lord Ganesh: కర్నూలు జిల్లాలో వెరైటీ వినాయకుడు.! శ్రీ ఉగ్రనరసింహ అవతారం..
వినాయక చవితి సందడి మొదలైంది. దేశ వ్యాప్తంగా ధిల్లీ నుంచి గల్లీ వరకూ గణపతిని ప్రతిష్టించడానికి మండపాలు అందంగా ముస్తాబు చేస్తన్నారు. మరోవైపు వివిధ రూపాయల్లో గణపయ్య మండపాలలో కొలువ దీరి భక్తులతో పూజలను అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపధ్యంలో కర్నూలు జిల్లలో ఎమ్మిగనూరులో గణపయ్య ఉగ్ర నరసింహ రూపంలో కొలువు దీరనున్నాడు.
వినాయక చవితి సందడి మొదలైంది. దేశ వ్యాప్తంగా ధిల్లీ నుంచి గల్లీ వరకూ గణపతిని ప్రతిష్టించడానికి మండపాలు అందంగా ముస్తాబు చేస్తన్నారు. మరోవైపు వివిధ రూపాయల్లో గణపయ్య మండపాలలో కొలువ దీరి భక్తులతో పూజలను అందుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఈ నేపధ్యంలో కర్నూలు జిల్లలో ఎమ్మిగనూరులో గణపయ్య ఉగ్ర నరసింహ రూపంలో కొలువు దీరనున్నాడు. శ్రీ ఉగ్రనరసింహ స్వామి అవతారం రూపంలో ఉన్న వినాయకుడు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది. కొండవీటి ప్రాంతంలో శ్రీ బాలవినాయక యువక మండలి ఆధ్వర్యంలో గత 33ఏళ్లుగా వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో పర్యావరణాన్ని కాపాడే విధంగా మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పటు చేస్తూన్నారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఏర్పటు చేసిన శ్రీ ఉగ్రనరసింహ స్వామి అవతారం రూపంలో ఉన్న వినాయకుడు అందరిని ఎంతగానో ఆకట్టుకుంటుంది.
స్థానిక కొండవీటి ప్రాంతంలో శ్రీ బాలవినాయక యువక మండలి ఆధ్వర్యంలో పర్యావరణాన్ని కాపాడుతు సుమారు 33 సంవత్సరాలు నుండి మట్టితో చేసిన వినాయక విగ్రహాన్ని ఏర్పటు చేస్తూన్నారు. అయితే వీరు ప్రతి సంవత్సరం పూజకు అవసరం అయ్యే సామాగ్రితోనే, ఒక్కో సంవత్సరం ఒక్కో వేరేటి రూపంలో వినాయకుడు విగ్రహం తయారు చేస్తూ పలువురుకు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఈ సంవత్సరం కూడా శ్రీశైలం,అరుణాచలం,కాశి నుండి 70 కేజీలు రుద్రాక్షల సేకరించి సుమారు 41 ఒక్క రోజుల పాటు శ్రమించి 20 అడుగుల ఎత్తుగల శ్రీ ఉగ్రనరసింహ స్వామి అవతారంలో మట్టి వినాయకుణ్ణి తయారు చేసారు. ఈ విగ్రహం పట్టణంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.ఈ విగ్రహం తయారీకి మూడు లక్షలు ఖర్చు అయిందన్నారు.ఈ విగ్రహాన్ని దర్శించుకునేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో తరలి వస్తారని వినాయక మండలి నిర్వాహకులు తెలిపారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.