AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Indonesia: ఇండోనేషియాలో రామాయణ వైభవం.. ఇస్లామిక్ కంట్రీలో ఎత్తైన గరుడ విగ్రహం!

ఇస్లామిక్ దేశమైన ఇండోనేషియాలోని 85% మంది హిందువులు నివసించే బాలిలో నూతన సంవత్సరానికి ముందు కెంకనా పార్క్‌లో గరుడ విష్ణు కెంకన కేచక్ నృత్యం జరిగింది.

Indonesia: ఇండోనేషియాలో రామాయణ వైభవం.. ఇస్లామిక్ కంట్రీలో ఎత్తైన గరుడ విగ్రహం!
Ramayana In Indonesia
KVD Varma
|

Updated on: Dec 28, 2021 | 9:42 AM

Share

Indonesia: రామాయణం ఎన్నిసార్లు విన్నా.. ఎన్ని రకాలుగా చూసినా ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తుంది. మనదేశంలో రామాయణం ఆధారంగా ఎన్నో కథలు.. పుస్తకాలు..నాటకాలు.. సినిమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ప్రజలను ఆకట్టుకున్నాయి. రామాయణం గొప్పతనం మనదేశంలోనే కాదు విదేశాలలోనూ వికసించింది. రామాయణానికి సంబంధించిన కథలను చాలా దేశాల్లో చెప్పుకుంటారు. దానికి సంబంధించిన విషయాలపై వచ్చే ప్రతి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు.

తాజాగా ఇస్లామిక్ దేశమైన ఇండోనేషియాలోని 85% మంది హిందువులు నివసించే బాలిలో నూతన సంవత్సరానికి ముందు కెంకనా పార్క్‌లో గరుడ విష్ణు కెంకన కేచక్ నృత్యం జరిగింది. ఈ నృత్యం రామాయణం ఆధారంగా రూపొందించారు. కోతి గొంతుతో ఈ నృత్య నాటకం మొదలైంది. దీని తర్వాత దాదాపు 100 మంది వ్యక్తులు వేదికపైకి వచ్చారు. తరువాత వారు రామాయణ ప్రదర్శన ప్రారంభం అయింది. వీరు బాలినీస్ నృత్య రూపంలో సీతా హరన్ సన్నివేశాలను ప్రదర్శించడం ప్రారంభించారు. తరువాత హనుమంతుని నేతృత్వంలోని వానరులు రావణుని ఓడించడానికి రాముడికి సహాయం చేయడం ప్రారంభించారు.

ఈ నృత్యాన్ని చూసేందుకు దేశంతో పాటు విదేశీ భక్తులు, పర్యాటకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.దీనికోసం 393 అడుగుల ఎత్తైన గరుడ విష్ణువు విగ్రహాన్ని కెంకనా పార్క్‌లో ప్రతిష్టించారు. దీనిని నిర్మించడానికి 25 సంవత్సరాలు పట్టింది. ఈ విగ్రహం అమెరికా స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ కంటే విశాలమైనది.ఈ గరుడ విగ్రహం రెక్కలు 60 మీటర్ల పొడవు ఉంటాయి. ఈ రామాయణ నృత్యాన్ని చూసిన భక్తులు, పర్యాటకులు ఆశ్చర్య ఆనందోత్సవాలకు గురయ్యారు.

బాలి ప్రత్యేకత ఏమిటంటే, ప్రతి ఇల్లు .. రెస్టారెంట్ వెలుపల, అరటి ఆకులతో చేసిన పళ్ళెంలో రెండు దేవతలకు పువ్వులు .. ఒక చెంచా బియ్యం ఉంచుతారు. ఇళ్ళు .. ముఖ్యమైన భవనాల ద్వారాల వద్ద కూడా వినాయకుని విగ్రహాలు ప్రతిప్రతిష్టించారు. మొత్తమ్మీద, బాలిలోని ప్రతి ఇల్లు ఒక దేవాలయంలా ఉంటుంది. ఇక్కడ ప్రతికూలతకు చోటు లేదు.

ఇవి కూడా చదవండి: Maoist vs Police: మావోయిస్టులపై పోలీసులు ప్రతీకారం తీర్చుకున్నారా? ఆ హత్యకు, ఎన్‌కౌంటర్‌కు సంబంధం ఉందా?

Harassment: రెచ్చిపోయిన కీచకులు.. 15 ఏళ్ల బాలికను వేరు వేరు ప్రాంతాలు తిప్పుతూ..

Viral Video: కళ్లను మాయ చేస్తున్న తొమ్మిదో వింత.. అచ్చం చెక్క ముక్కలా..