మేయర్‌ను ఈడ్చుకొచ్చి.. జుట్టు కత్తిరించి..
బొలీవియాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఇప్పటికే మరింత ఉధృతంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఘటనల్లో.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మరణించిన వారిలో ఓ విద్యార్ధి మృతికి కొచాబాంబ మేయర్ పేట్రిసియా కారణమంటూ ఆందోళనకారులు రెచ్చిపోయారు. సదరు మేయర్ మహిళ అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఏకంగా మేయర్ కార్యాలయానికి నిప్పంటించి.. పేట్రిసియాను బయటికి ఈడ్చుకొచ్చారు. అంతేకాదు.. పేట్రిసియా ఒక హంతకురాలు […]
బొలీవియాలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనలు.. ఇప్పటికే మరింత ఉధృతంగా మారాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య జరుగుతున్న ఘటనల్లో.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ మరణించిన వారిలో ఓ విద్యార్ధి మృతికి కొచాబాంబ మేయర్ పేట్రిసియా కారణమంటూ ఆందోళనకారులు రెచ్చిపోయారు. సదరు మేయర్ మహిళ అనే విషయాన్ని కూడా మర్చిపోయారు. ఆమె పట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఏకంగా మేయర్ కార్యాలయానికి నిప్పంటించి.. పేట్రిసియాను బయటికి ఈడ్చుకొచ్చారు. అంతేకాదు.. పేట్రిసియా ఒక హంతకురాలు అంటూ నినాదాలు చేశారు. వెంట తీసుకొచ్చిన ఎరుపు రంగును ఆమె ముఖానికి పూసి.. జుట్టు కత్తిరించారు. సమాచారమందుకున్న పోలీసులు నిరసనకారులను అదుపులోకి తీసుకొని పేట్రిసియాను ఆస్పత్రికి తరలించారు.