Princess Diana Statue: ప్రిన్సెస్ డయానా విగ్రహం ఆవిష్కరణ; ప్రిన్స్ విలియం, హ్యారీలపైనే అందరి ఆసక్తి..!
ప్రిన్స్ విలియం, హ్యారీ ఇద్దరూ కలిసి గురువారం వారి తల్లి ప్రిన్సెస్ డయానా 60 వ పుట్టినరోజు సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రిన్సెస్ డయానా గతంలో నివాసమున్న లండన్ లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ లోని తోటలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు.
Princess Diana Statue: ప్రిన్స్ విలియం, హ్యారీ ఇద్దరూ కలిసి గురువారం వారి తల్లి ప్రిన్సెస్ డయానా 60 వ పుట్టినరోజు సందర్భంగా ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. ప్రిన్సెస్ డయానా గతంలో నివాసమున్న లండన్ లోని కెన్సింగ్టన్ ప్యాలెస్ లోని తోటలో ఆమె విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే విగ్రహం తయారీ పనులను 2017 లో ప్రకటించారు. ఈమేరకు తమ తల్లి జీవితాన్ని గుర్తుచేసుకుని, ఆదర్శంగా ఉండేందుకు ఈ విగ్రహం మాకు తోడుగా నిలుస్తుందని వారు జంటగా పేర్కొన్నారు. కాగా, ఇంతకుముందు సోదరుల మధ్య కొంత విభేదాలు ఉన్నట్లు వార్తలు వినిపించిన నేసథ్యంలో ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమంలో పాల్గొనడంపైనే అంతా ఆసక్తి చూపిస్తున్నారు. అయితే, వారి తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమంలో విభేదాలను పక్కనపెట్టి మరీ ఒక్కటయ్యారు. 1997 లో పారిస్‌లో జరిగిన ఓ కారు ప్రమాదంలో 36 ఏళ్ల వయసులో యువరాణి మరణించారు. ఇప్పటికీ చాలామంది ఆమెకు ఆదర్శంగా, ప్రేరణగా ఉంటుందని ప్రజలు చెబుతూనే ఉంటారు. ప్రిన్సెస్ డయానా వాడిన కారు ఫోర్డ్ ఎస్కార్ట్.. మంగళవారం చిలీలోని ఒక మ్యూజియం 72,000 యూస్ డాలర్లకు సొంతం చేసుకుంది. ఈ కారు ప్రిన్సెస్ డయానా వివాహానికి రెండు నెలల ముందు ప్రిన్స్ చార్లెస్ 1981 మేలో గిఫ్ట్ గా ఇచ్చారంట. ఈ కారు ఇప్పటికీ బ్రిటిష్ రిజిస్ట్రేషన్ ప్లేట్ WEV 297W తోనే ఉండడం గమనార్హం.
గురువారం జరిగిన వేడుకల్లో రాయల్ కుటుంబీకులు మాత్రమే పాల్గొన్నారు. ఇది వారి వ్యక్తిగత వేడుకలా నిర్వహించుకున్నారు. అయితే, అందరి కళ్లు మాత్రం ప్రిన్సెస్ డయానా కుమారులపైనే ఉంది. గత వారం కాలిఫోర్నియా నుంచి తిరిగి వచ్చిన హ్యారీ, ఇటీవల తన తాత ప్రిన్స్ ఫిలిప్ అంత్యక్రియలకు హాజరయ్యాడు. అలాగే తన అమ్మమ్మ క్వీన్ ఎలిజబెత్ II ను ఏప్రిల్‌లో కలిసినట్లు తెలుస్తోంది. అయితే, బ్రిటిష్ యువరాజు హ్యారీ, ఆయన సతీమణి మేఘాన్ మెర్కెల్‌లు వారి కుమారుడు ప్రిన్స్ ఆర్చీతో సహా రాజకుటుంబ సభ్యుల హోదాను వీడి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సోదరుల మధ్య విభేదాలు ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీనిని రాజ కుటుంబం కూడా ఖండించింది. అయితే, హ్యారీ ఎప్పుడు తిరిగొచ్చినా తమకు అభ్యంతరం లేదని కూడా రాజ కుటుంబం ప్రకటించింది.
Also Read:
Booster Dose: ఆ దేశంలో మూడో డోసు వ్యాక్సిన్ ప్రారంభం.. మళ్లీ పెరుగుతున్న కరోనా పాజిటివ్ కేసులు.. !
Malaria: ఏడు దశాబ్దాల నిరంతర ప్రయత్నం..మలేరియా రహిత దేశంగా చైనా!