Afghanistan President Ashraf Ghani: అస్థిరత ప్రమాదంలో చిక్కుకున్న దేశం..నివారిస్తాం..దేశ ప్రజలనుద్దేశించి ఆఫ్ఘన్ అధ్యక్షుని ప్రసంగం..
దేశం తీవ్ర అస్థిరత ప్రమాదంలో చిక్కుకుందని, దీన్ని నివారించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ప్రకటించారు. తాలిబన్లు తమ పోరు తీవ్రతను పెంచుతూ క్రమంగా కాబూల్ నగరానికి చేరువవుతున్న తరుణంలో....
దేశం తీవ్ర అస్థిరత ప్రమాదంలో చిక్కుకుందని, దీన్ని నివారించడానికి అన్ని విధాలా ప్రయత్నిస్తామని ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రాఫ్ ఘని ప్రకటించారు. తాలిబన్లు తమ పోరు తీవ్రతను పెంచుతూ క్రమంగా కాబూల్ నగరానికి చేరువవుతున్న తరుణంలో..శనివారం ఆయన టీవీ ద్వారా దేశ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. మన దేశం ఇప్పుడు అస్థిరత ప్రమాదాన్ని ఎదుర్కొంటూ ప్రమాదకర పరిస్థితుల్లో పడిందని, తమ భవిష్యత్తు గురించి ప్రజలు ఎలా ఆందోళన చెందుతున్నారో తనకు తెలుసునని ఆయన చెప్పారు. ఆఫ్ఘనిస్థాన్ మరింత అస్థిరతను, హింసను ఎదుర్కోకుండా మీ అధ్యక్షునిగా హామీ ఇస్తున్నానన్నారు. మీరు దేశం వదిలి వెళ్లకుండా చూస్తామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో సెక్యూరిటీ, రక్షణ దళాలను సమీకరించడం తమ టాప్ ప్రయారిటీ అని ఆయన పేర్కొన్నారు. తాజా పరిస్థితులపై ప్రభుత్వం లోను రాజకీయ నేతలతోనూ, ప్రజా ప్రతినిధులు, అంతర్జాతీయ భాగస్వామ్య పక్షాలతో కూడా చర్చిస్తున్నామని.., శాంతి, సుస్థిరత నెలకొనేలా ఓ రాజకీయ పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని ఘని తెలిపారు.
ఈ చర్చల ఫలితాలను త్వరలో మీకు తెలియజేస్తామన్నారు. ఈ యుద్ధం మరింత ముదిరి ప్రజల ఊచకోతకు దారి తీయదని..మీ అయిదేళ్ల విజయాలను నాశనం చేయదని ఆశిస్తున్నట్టు ఆయన చెప్పారు. మన సైనిక దళాలు సాహసంతో వార్ కొనసాగిస్తున్నాయని అంటూ ఆయన వారిని ప్రశంసించారు. తన ప్రసంగంలో ఆయన తన రాజీనామా యోచన గురించి గానీ.. ప్రస్తుత పరిస్థితికి తనదే బాధ్యత అని గానీ ఎక్కడా ప్రస్తావించలేదు. తాలిబన్లు, పాకిస్థాన్ కూడా ఘని రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్న విషయం గమనార్హం. అలాగే ప్రభుత్వం. తాలిబన్ల ,మధ్య అధికార పంపిణీ జరగవచ్చునని ఇటీవల వఛ్చిన వార్తల గురించి కూడా ఆఫ్ఘన్ అధ్యక్షుడు ప్రస్తావించలేదు.
మరిన్ని ఇక్కడ చూడండి : వైసీపీ నేతలకు భయం పట్టుకుంది అన్న నారా లోకేష్ కు అనిల్ యాదవ్ కౌంటర్ :Nara Lokesh vs Anil Yadhav Video.
కొత్త వివాదంలో కంగనా రనౌత్.. ఆమె డ్రెస్ పై నెటిజన్లు భయంకరమైన ట్రోలింగ్ : Kangana Ranaut Video.