AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Covid Vaccine: ఇక వారికి రెండు కాదు మూడు డోసులు.. కోవిడ్ టీకాపై అమెరికా కీలక నిర్ణయం

మూడో విడతలలో విజృంభించేందుకు సిద్ధమవుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఆగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది.

Covid Vaccine: ఇక వారికి రెండు కాదు మూడు డోసులు.. కోవిడ్ టీకాపై అమెరికా కీలక నిర్ణయం
Covid 19 Vaccine
Balaraju Goud
|

Updated on: Aug 14, 2021 | 5:40 PM

Share

Third shot of Covid 19 Vaccine in US: మూడో విడతలలో విజృంభించేందుకు సిద్ధమవుతున్న కరోనా మహమ్మారిని నియంత్రించేందుకు ఆగ్రరాజ్యం అమెరికా మరో కీలక నిర్ణయం తీసుకుంది. బలహీన రోగనిరోధకశక్తిని దృష్టిలో ఉంచుకుని కోవిడ్ మూడో డోసు టీకాకు అమెరికా ఆమోదం తెలిపింది. ఈ మేరకు అమెరికన్లు రెండు డోసుల తర్వాత మరో టీకా తీసుకునేందుకు అనుమతిస్తూ అమెరికా వ్యాధి నియంత్రణ, నిర్మూలన కేంద్రం (సీడీసీ) ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయంతో కోవిడ్ ముప్పు అధికంగా ఉన్న వారితో పాటు.. సాధారణ ప్రజలకు సైతం వైరస్ నుంచి రెట్టింపు రక్షణ లభించనుందని సీడీసీ డైరెక్టర్ రొచెల్లె వాలెన్‌స్కీ పేర్కొన్నారు. అమెరికాలో ప్రస్తుతం ఫైజర్‌, మోడెర్నా టీకాలు అందుబాటులో ఉన్నాయి.

చైనాలో మొదలైన కరోనా మహమ్మారి ప్రపంచాన్ని మొత్తం చుట్టేసిన సంగతి తెలిసిందే. మొదటి, రెండు విడతల్లోనూ అల్లకల్లోలం సృష్టించింది. సెకండ్ వేవ్ కారణంగా అమెరికాలో లక్షలాది మంది వైరస్ బారిన పడ్డారు. అయితే థర్డ్ వేవ్ ఎఫెక్ట్ తప్పకపోవచ్చని నిపుణులు హెచ్చరికలకు తోడు.. అమెరికాలో కొత్త కేసుల సంఖ్య మరోసారి గణనీయంగా పెరగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ఎఫ్‌డీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు రెండు డోసులు టీకా అందించింది. తాజాగా మూడో డోసుకు కూడా ఒకే చెప్పేసింది.

ముఖ్యంగా అవయవ మార్పిడి జరిగిన వారు, ఇతర కారణాలతో అనారోగ్యంతో బాధపడుతూ.. బలహీనంగా ఉన్నవారు మూడో డోసు వెంటనే తీసుకోవాలని అధికారులు సూచించారు. ఇందుకు వైద్యుల ప్రిస్క్రిప్షన్ కానీ, అధికారిక ధ్రువీకరణ కానీ అవసరంలేదని సీడీసీ అధికారి డా.అమందా కోన్‌ స్పష్టం చేశారు. మిన్నెసోటా విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్న అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ డేవిడ్ బౌల్‌వేర్ సీడీసీ నిర్ణయానికి నిర్ణయానికి మద్దతు తెలిపారు. రెండు డోసులు వేసుకున్నవారిలో చాలా చాలామందికి రోగనిరోధకశక్తి లేదని.. అలాంటి వారికి మూడో డోసు ఇవ్వడం వల్ల కొంత ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు.

కరోనా మహమ్మారి మరోమారు అగ్రరాజ్యంపై పంజా విసురుతున్న క్రమంలో మూడో డోసు టీకాకు అనుమతివ్వడం అమెరికన్లకు మరింత రక్షణ కల్పించనుందని అక్కడి వైద్య నిపుణులు భావిస్తున్నారు. టీకాల పంపిణీ విషయంలో పేద, ధనిక దేశాల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు బూస్టర్ డోసుపై తాత్కాలిక నిషేధం విధించాలన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తిని గత నెల అమెరికా తిరస్కరించింది.

Read Also…  దేశవ్యాప్తంగా రేపు అన్నదాతల ‘తిరంగా ర్యాలీలు’.. నిరసన ప్రదర్శనలు..హర్యానాలో 5 వేల ట్రాక్టర్లతో ‘మార్చ్’