దేశవ్యాప్తంగా రేపు అన్నదాతల ‘తిరంగా ర్యాలీలు’.. నిరసన ప్రదర్శనలు..హర్యానాలో 5 వేల ట్రాక్టర్లతో ‘మార్చ్’
వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా రేపు అన్ని తాషీల్, బ్లాకు స్థాయిలో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని తాము కిసాన్ మజ్దూర్ ఆజాదీ సంగ్రామ్ దివస్ గా పాటిస్తామని....
వివాదాస్పద మూడు రైతు చట్టాలను రద్దు చేయాలంటూ దేశ వ్యాప్తంగా రేపు అన్ని తాషీల్, బ్లాకు స్థాయిలో తిరంగా ర్యాలీలు నిర్వహిస్తామని రైతు సంఘాలు ప్రకటించాయి. భారత 75 వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని తాము కిసాన్ మజ్దూర్ ఆజాదీ సంగ్రామ్ దివస్ గా పాటిస్తామని సంయుక్త కిసాన్ మోర్చా నేతలు తెలిపారు. హర్యానాలో 5 వేల ట్రాక్టర్లతో మార్చ్ నిర్వహిస్తామని..జింద్ జిల్లాలో భారీ ఎత్తున జరిగే ఈ ఆందోళనలో పెద్ద సంఖ్యలో మహిళా రైతులు కూడా పాల్గొంటారని భారతీయ కిసాన్ యూనియన్ వెల్లడించింది. పంజాబ్, ఉత్తరాఖండ్, యూపీ రాష్ట్రాల నుంచి కూడా రైతులు ఈ మార్చ్ కి హాజరవుతారని పేర్కొంది. ఆదివారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ఆందోళన కొనసాగుతుందని నేతలు తెలిపారు. ఇక ఢిల్లీ శివారులోని మూడు బోర్డర్లలో జాతీయ జెండాలతో నిరసన ప్రదర్శనలు కొనసాగుతాయన్నారు. అయితే ఢిల్లీ నగరంలో ప్రవేశించబోమన్నారు.
కానీ కొన్ని రైతు సంఘాలు హఠాత్తుగా నగరంలోకి ప్రవేశించి అవాంఛనీయ ఘటనలకు పాల్పడవచ్చునని అందిన సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. గత జనవరి 26 న రిపబ్లిక్ డే సందర్భంగా ఎర్రకోట వద్ద జరిగిన హింసాత్మక ఘర్షణలను వారు మరచిపోలేదు. అప్పుడు కూడా శాంతియుతంగా నిరసన తెలుపుతామని మొదట ప్రకటించిన వారు.. ఆ తరువాత ఎర్రకోట వద్ద ఓ పతాకాన్ని ఎగురవేసి.. అడ్డుకోవడానికి యత్నించిన తమ పైనే దాడులకు దిగిన విషయాన్ని పోలీసులు గుర్తు చేస్తున్నారు.ఇప్పటికే ఢిల్లీలో అనేక చోట్ల భద్రతను కట్టుదిట్టం చేశారు. కీలక ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశారు.
మరిన్ని ఇక్కడ చూడండి : వైసీపీ నేతలకు భయం పట్టుకుంది అన్న నారా లోకేష్ కు అనిల్ యాదవ్ కౌంటర్ :Nara Lokesh vs Anil Yadhav Video.
కొత్త వివాదంలో కంగనా రనౌత్.. ఆమె డ్రెస్ పై నెటిజన్లు భయంకరమైన ట్రోలింగ్ : Kangana Ranaut Video.