TS Corona Cases: తెలంగాణలో అత్యల్ప స్థాయికి కరోనా కేసులు.. కొత్త నమోదైన పాజిటివ్ కేసులు ఎన్నంటే..?
తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది.
Telangana Coronavirus Cases: తెలంగాణలో కరోనా మహమ్మారి ప్రభావం క్రమంగా తగ్గుతూ వస్తోంది. రోజు రోజుకీ పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతోంది. కాగా, రాష్ట్రంలో గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 420 మందికి కోవిడ్ పాజిటివ్ నిర్దారణ అయ్యింది. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 6,52,135కి చేరుకుంది. వైరస్ మహమ్మారి బారినపడిన వారిలో 623 మంది కోలుకుని సరక్షితంగా డిశ్చార్జి అయ్యారు. ఇక, మాయదారి వైరస్ ధాటికి కొత్త మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది.
అయితే, ఇవాళ్టివరకు రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్ కోలుకుని మొత్తం 6,40,688 మంది ఇళ్లకు చేరుకున్నారు. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో 7,606 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు మొత్తం కరోనా ధాటికి తాళలేక మరణించిన వారి సంఖ్య 3,814కు చేరింది. రాష్ట్రవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 87,355 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేసినట్లు వైద్య ఆరోగ్యశాఖ తన నివేదికలో వెల్లడించింది. దీంతో మొత్తంగా 2,33,44,552 నమూనాలను పరీక్షించినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది.
ఇక జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసుల వివరాలు ఇలా ఉన్నాయి….
Read Also…. Heart Attack: గుండెపోటుకు సాలీడు విషంతో చెక్.. తొలిసారిగా హార్ట్ ఎటాక్ మందు కనిపెట్టిన పరిశోధకులు