Heart Attack: గుండెపోటుకు సాలీడు విషంతో చెక్.. తొలిసారిగా హార్ట్ ఎటాక్ మందు కనిపెట్టిన పరిశోధకులు

విషం..ప్రాణాలను తీస్తుంది. అయితే అదే విషం ప్రణాలను నిలబెడుతుంది కూడా. అవును..తాజగా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు. 

Heart Attack: గుండెపోటుకు సాలీడు విషంతో చెక్.. తొలిసారిగా హార్ట్ ఎటాక్ మందు కనిపెట్టిన పరిశోధకులు
Heart Attack
Follow us
KVD Varma

|

Updated on: Aug 14, 2021 | 9:35 PM

Heart Attack: విషం..ప్రాణాలను తీస్తుంది. అయితే అదే విషం ప్రణాలను నిలబెడుతుంది కూడా. అవును..తాజగా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన సాలీడు విషంతో గుండెపోటుకు చికిత్స చేయవచ్చని పరిశోధకులు గుర్తించారు.  గుండె జబ్బు తర్వాత గుండెకు నష్టం జరగకుండా నిరోధించే అణువులు ఫన్నెల్ బేబ్ అనే స్పైడర్ విషంలో కనుగొన్నట్టు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇది మాత్రమే కాదు, గుండె మార్పిడి జరిగిన రోగుల జీవితాన్ని కూడా ఈ విషంతో పెంచవచ్చంటున్నారు.

ఈ ఔషధం ఎలా పనిచేస్తుందంటే.. 

ఈ ఔషధం ఎలా పనిచేస్తుందో డాక్టర్ నాథన్ చెప్పారు. సాలీడు విషంలో హి 1 ఎ అనే ప్రోటీన్ కనిపిస్తుంది. గుండె నుండి వచ్చే డెత్ సిగ్నల్ ఆపడానికి ఇది పనిచేస్తుంది. ఇది జరిగినప్పుడు, కణాల మరణాన్ని నివారించవచ్చు. దాని ప్రభావం కారణంగా, గుండె కణాలు మెరుగుపడతాయి. గుండెపోటు తర్వాత నష్టాన్ని నివారించడానికి ఇచ్చే ఔషధం ఇప్పటివరకు తయారు కాలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

ప్రొఫెసర్ మెక్‌డొనాల్డ్ ఈ విధంగా తెలిపారు. ”ఈ ఔషధం ప్రపంచవ్యాప్తంగా గుండెపోటుతో బాధపడుతున్న లక్షలాది మంది రోగులకు ఉపశమనం అందిస్తుంది. ఇది కాకుండా, మరొక పెద్ద ఉపశమనం ఉంటుంది. హీ1ఎ  ప్రోటీన్ సహాయంతో, దాతల ద్వారా దానం చేయబడిన గుండె కణాలు మెరుగుపడతాయి. ఈ విధంగా, విజయవంతంగా గుండె మార్పిడి అవకాశాలు పెరుగుతాయి.

ఇలా కనుగొన్నారు..

ప్రొఫెసర్ గ్లెన్ కింగ్ ఒక ఫన్నెల్ వెబ్ సాలీడు విషంలో ఒక ప్రోటీన్‌ను కనుగొన్నారు. బ్రెయిన్ స్ట్రోక్ తర్వాత కోలుకోవడానికి ఈ ప్రోటీన్ సహాయపడుతుందని పరిశోధనలో వెల్లడైంది. స్ట్రోక్ తర్వాత 8 గంటల తర్వాత రోగికి ఈ ప్రొటీన్ ఇచ్చినప్పుడు, మెదడులో జరిగే నష్టాన్ని ఇది సరిచేస్తుందని కనుగొనడం జరిగింది.

ఇక్కడ నుండి, గుండె కణాలను రిపేర్ చేయడానికి పరిశోధన కూడా ప్రారంభించారు. ఎందుకంటే మెదడులాగే, గుండె కూడా శరీరంలో ఒక ముఖ్యమైన భాగం, దాని రక్త ప్రవాహంలో ఆటంకాలు, ఆక్సిజన్ లేకపోవడం వల్ల, ఇది నేరుగా రోగిని ప్రభావితం చేస్తుంది.

అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించవచ్చు

ప్రోటీన్ నుంచి తయారు చేసిన ఔషధ వినియోగాన్ని అత్యవసర పరిస్థితుల్లోనూ ఉపయోగించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. తరచుగా గుండెపోటు కేసులలో, రోగికి తక్షణ చికిత్స అవసరం. అటువంటి పరిస్థితిలో, ఈ ఔషధం అంబులెన్స్‌లో రోగికి ఇస్తారు. తద్వారా పరిస్థితి మరింత దిగజారకుండా నిరోధించవచ్చు.

ఈ ఔషధం ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఇక్కడ నివసిస్తున్న రోగులు ఆసుపత్రికి చేరుకోవడానికి చాలా సమయం పడుతుంది. అటువ అటువంటివారికి ఈ మందు ఇవ్వడం ద్వారా వారి గుండె నొప్పి ప్రమాదాన్నివెంటనే, నివారించవచ్చు. ఎందుకంటే..గుండెపోటు వచ్చినప్పుడు, ప్రతి సెకను విలువైనది.

Also Read: Cancer and Peanut: క్యాన్సర్ రోగులు వేరుశెనగ తింటే మరణానికి దగ్గరగా వెళ్ళినట్టే అంటున్న పరిశోధకులు.. ఎందుకంటే..

Corona Affect on Brain: కరోనా వైరస్‌ మెదడుపై కూడా ప్రభావం చూపిస్తుంది..ఎలా దానిని నివారించవచ్చు? నిపుణులు ఏమంటున్నారు?