Cancer and Peanut: క్యాన్సర్ రోగులు వేరుశెనగ తింటే మరణానికి దగ్గరగా వెళ్ళినట్టే అంటున్న పరిశోధకులు.. ఎందుకంటే..
క్యాన్సర్ రోగులు వేరుశెనగ తినే అలవాటు వారికి మరింత అనారోగ్యాన్ని తెస్తుంది. ఈ విషయాన్ని పరిశోధకులు చెబుతున్నారు.
Cancer and Peanut: క్యాన్సర్ రోగులు వేరుశెనగ తినే అలవాటు వారికి మరింత అనారోగ్యాన్ని తెస్తుంది. ఈ విషయాన్ని పరిశోధకులు చెబుతున్నారు. వేరుశెనగ తినే అలవాటు ఉన్న క్యాన్సర్ రోగులలో అది మరింత ముదురుతోందని వారంటున్నారు. క్యాన్సర్‌తో వచ్చే ఇబ్బందుల విషయంలో ఇది కొత్తకోణం అని వారు వెల్లడించారు. దీనికి సంబంధించి జరిపిన విస్తృత పరిశోధనల తరువాత ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్టు వారు వివరించారు.
ఇంగ్లాండ్‌లోని లివర్‌పూల్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు తమ అధ్యయనంలో ఈ వాదన చేశారు. వేరుశెనగలో వేరుశెనగ అగ్లుటినిన్ (PNA) అనే ప్రోటీన్ ఉన్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ ప్రోటీన్ శరీరానికి రెండు అణువులను (IL-6 , MCP-1) విడుదల చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరమంతా క్యాన్సర్ వ్యాప్తికి కారణమవుతుంది.
క్యాన్సర్ వ్యాప్తి ప్రమాదాన్ని పెంచుతుంది..
కార్సినోజెనిసిస్ జర్నల్‌లో ఈపరిశొధన వివరాలు ప్రచురించారు. దాని ప్రకారం వేరుశెనగ భోజనం పేరుతో ప్రోటీన్ వేరుశెనగ అగ్లుటినిన్ రక్తంలో కలిసి శరీరమంతా తిరుగుతుంది. ఈ ప్రోటీన్ రక్తం ద్వారా కణితులను చేరుకుంటుంది. అలాగే, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాపించేలా ఒత్తిడి చేస్తుంది. ఈ ప్రోటీన్ క్యాన్సర్ కణాలు కలిసి ఉండటానికి అదేవిధంగా, శరీరంలోని ఇతర భాగాలకు వ్యాప్తి చెందడానికి ప్రయత్నిస్తుంది.
తెలియకుండా మరణ ప్రమాదం..
ప్రతిరోజూ 250 గ్రాముల వేరుశెనగ తిన్న క్యాన్సర్ రోగులకు ఎక్కువ ప్రమాదం ఉన్నట్లు తేలింది. అటువంటి ప్రమాదాలను నివారించడానికి, ఒక వ్యక్తి ఒక రోజులో 28 గ్రాముల వేరుశెనగ మాత్రమే తినాలని శాస్త్రవేత్తలు అంటున్నారు. అంతకు మించి వేరుశెనగ తినడం వలన క్యాన్సర్ రోగులు తెలియకుండానే మరణం అంచుకు చేరిపోతారట.
పరిశోధకులు గ్యాంగ్ యు ప్రకారం, క్యాన్సర్ రోగులు దీనిని తినడం మానుకోవాలి. ఇది ఆశ్చర్యకరమైన వార్త, కానీ నిజం. క్యాన్సర్ రోగులు వేరుశెనగను ఎక్కువగా తింటే వారి పరిస్థితి మరింత విషమించవచ్చు. క్యాన్సర్ రోగులు ప్రమాదాన్ని తగ్గించడానికి తరచుగా లేదా అధికంగా వేరుశెనగ తినడం మానుకోవాలి.
పరిశోధకుల అభిప్రాయం ప్రకారం, శరీరానికి PNA ను జీర్ణం చేయడం కష్టం. ఈ ప్రోటీన్ ఒక వేరుశెనగలో దాని బరువులో 0.15 శాతం వరకు ఉంటుంది. ఈ పరిశోధనలు చాలాకాలంగా సాగుతున్నాయనీ.. క్యాన్సర్ వ్యాధికి.. వేరుశనగకూ ఇంత కనెక్షన్ ఉంటుందనేది ఊహించింది కాదనీ పరిశోధకులు అంటున్నారు. కానీ, ఈ పరిశోధనలో వెల్లడైన ఈ అంశాన్ని అందరూ గమనించాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేస్తున్నారు.