Dust Allergy: డస్ట్ అలర్జీతో ఇబ్బంది పడుతున్నారా ? ఈ ఆరు పదార్థాలతో చెక్ పెట్టేయండిలా..
చాలా మందికి డస్ట్ అలర్జీ ఉంటుంది. గాలిలోని ఉన్న దుమ్ము, ధూళీ కణాల కారణంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. దీంతో వరుసగా
చాలా మందికి డస్ట్ అలర్జీ ఉంటుంది. గాలిలోని ఉన్న దుమ్ము, ధూళీ కణాల కారణంగా ఎంతో ఇబ్బంది పడుతుంటారు. దీంతో వరుసగా తుమ్ములు రావడం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ముక్కు కారడం, కళ్ల వాపు, ముక్కు, గొంతులో దురద, దగ్గు, తలనొప్పి, అలసట, బలహీనత వంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ సమస్యను అధిగమించేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఫలితం అంతగా ఉండదు. అసలు ఈ డస్ట్ అలర్జీ ఎలా వస్తుందో ముందుగా తెలుసుకుందామా. ఇందుకు కారణం డస్ట్ మైట్స్. ఇందులో ఉండే సూక్ష్మ జీవులు .. గాలిలో ఉండే పుప్పొడి కణాలు, జంతువుల వెంట్రుకలు, చుండ్రు, ఫంగస్ ఇలా అనేక రకాల బ్యాక్టీరియా కూడా అలర్జీకి కారణమవుతాయి. డస్ట్ అలర్జీని తగ్గించుకునేందుకు ఇంట్లో ఉండే కొన్ని పదార్థాలను ఉపయోగించవచ్చు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందామా.
ఆపిల్ వెనిగర్.. డస్ట్ అలర్జీని తగ్గించుకోవడానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగపడుతుంది. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్ మిక్స్ చేసి తాగాలి. ఇందులో కొన్ని చుక్కల తేనె కూడా కలుపుకోవచ్చు. ఆపిల్ సైడర్ వెనిగర్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు అలర్జీని తగ్గించడంలో సహాయపడతాయి.
యాకలిప్టస్ లేదా లావెండర్ నూనె.. అలర్జీని తగ్గించుకునేందుకు యాకలిప్టస్, లావెండర్ నూనె ఉపయోగించవచ్చు. వేడి నీటిలో 4-5 చుక్కల యూకలిప్టస్, లావెండర్ నూనెను వేసి పీల్చుకోవాలి. ఈ రెండు నూనెలు శోథ నిరోధక, అనాల్జేసిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇది మంట, నొప్పిని తగ్గించడంలో సహయపడతాయి.
తేనె.. అలర్జీని తగ్గించడానికి తేనె సహయపడుతుంది. ప్రతి రోజు నేరుగా రెండు చెంచాల తేనెను తీసుకోవాలి. తేనెను ఒక కప్పు నీటిలపో కలపి తీసుకోవచ్చు. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అలర్జీని తగ్గించడంలో సహాయపడతాయి.
పసుపు.. అలర్జీని తగ్గించడానికి పసుపు, నల్ల మిరియాలు సహయపడతాయి. ఇందుకోసం ఒక కప్పు పాలలో అర టీ స్పూన్ కలపాలి. ఆ తర్వాత పాలను వేడిచేయాలి. ఆతర్వాత పాలను కాస్త చల్లార్చి అందులో చిటికెడు నల్ల మిరియాలు, కొన్ని చుక్కల తేనె కలిపి తీసుకోవాలి. పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి అలర్జీని తగ్గిస్తాయి.
కలబంద రసం.. కలబంద రసం అలర్జీని తగ్గిస్తుంది. ముందుగా కలబంద ఆకు తీసుకుని దాని తొక్కను తీసివేయాలి. ఆ తర్వాత దానిపై ఉండే పసుపు పొరను కూడా తొలగించాలి. అందులో నుంచి జెల్ తీసి మిక్సీలో వేసి ఒక కప్పు నీరు కలిపి మిక్సీ పట్టాలి. అనంతరం ఆ రసాన్ని తాగాలి. కలబందలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు.. బ్యాక్టీరియా, ఫంగస్ సమస్యలను తగ్గించే లక్షణాలు ఉన్నాయి. ఇవి అలర్జీల వలన కలిగే సమస్యలను తగ్గిస్తాయి.
Also Read: Bigg Boss 5 Telugu: బోర్డమ్కి చెప్పేయండి గుడ్ బాయ్.. వచ్చేస్తున్నాడు బాస్..