Corona Virus: ఆ ప్రధాన నగరంలో థర్డ్‌వేవ్ మొదలైందా.. 550 మంది చిన్నారులకు పాజిటివ్.. సీఎం ఎమర్జెన్సీ మీటింగ్
Corona Virus: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గినా.. మళ్ళీ థర్డ్ వేవ్ ఉంటుందని.. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని.. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య సిబ్బంది హెచ్చరికలు జారీ..
Corona Virus: దేశంలో కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గినా.. మళ్ళీ థర్డ్ వేవ్ ఉంటుందని.. ప్రభుత్వాలు ముందస్తు చర్యలు తీసుకోవాలని.. ప్రజలు తగిన జాగ్రత్తలు పాటించాలని వైద్య సిబ్బంది హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంది. అంతేకాదు కరోనా థర్డ్ వేవ్ లో ముప్పు చిన్నారులపైనే అంటూ వైద్య సిబ్బంది చెబుతున్న మాటలు నిజమేనా అనిపించినలా బెంగళూరులోని తాజా పరిస్థితులు ఉన్నాయి. వివరాల్లోకి వెళ్తే..
దేశంలో కోవిడ్ ఉధృతి తగ్గినట్లే తగ్గి,, మళ్ళీ కేసుల సంఖ్య పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది. థర్డ్ వేవ్ ప్రారంభమైందేమో అనిపించేలా బెంగళూరులో కరోనా విలయతాండవం చేస్తోంది. ఆగష్టు నెల ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ అక్కడ భారీగా పిల్లలు కరోనా బారిన పడుతున్నారు..ఇప్పటి వరకూ అక్కడ దాదాపు 550మంది చిన్నారులకు కరోనా పాజిటివ్ గా నమోదయ్యింది. నగరంలో సుమారు 550 మంది పిల్లలకు కోవిడ్ సోకినట్లు బృహత్ బెంగళూరు మహానగర పాలికె ప్రకటిచింది.
బాధితుల్లో 210 మంది పిల్లలు 0 నుంచి 9 ఏళ్ళలోపు పిల్లలు కాగా, 10 నుంచి 19 మధ్య వయస్కుల సంఖ్య 340 మంది ఉన్నారని తెలిపింది. పిల్లల్లో కరోనా లక్షలను లేకుండానే కరోనా సోకినట్లు.. ఎవరూ మరణించలేదని చెప్పింది. తాజా పరిస్థితులపై అధికారులు వైద్య సిబ్బంది తీసుకోవలసిన చర్యలపై కర్ణాటక సీఎం బొమ్మై ప్రత్యేక సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిసారించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.