Political crisis in Nepal: నేపాల్‌లో మరోసారి రాజకీయ సంక్షోభం.. పార్లమెంట్‌ను రద్దు చేసిన ప్రధాని కేపీ శర్మ ఓలి..
నేపాల్ దేశంలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆదేశ ప్రధాని కేపీ శర్మ ఓలి పార్లమెంట్‌ను రద్దు చేశారు.

Political crisis in Nepal: నేపాల్ దేశంలో మరోసారి రాజకీయ సంక్షోభం నెలకొంది. ఆదేశ ప్రధాని కేపీ శర్మ ఓలి పార్లమెంట్‌ను రద్దు చేశారు. అత్యవసర కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసిన ఆయన పార్లమెంట్ రద్దుపై స్పష్టమైన నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పార్లమెంట్ రద్దు నిర్ణయాన్ని నేపాల్ ప్రెసిడెంట్‌కు పంపించారు. కాగా, ఓలి నిర్ణయాన్ని అధికార నేపాల్ కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. ఇది తొందరపాటు నిర్ణయం అంటూ నిప్పులు చెరిగింది. ఓలి నిర్వహించిన కేబినెట్ సమావేశానికి మంత్రులందరూ హాజరు కాలేదంది. ఇది ప్రజాస్వామ్య విరుద్ధమని ఆ పార్టీ అధికార ప్రతినిధి నారాయణ్ కాజీ శ్రేష్ఠ వ్యాఖ్యానించారు. ఓలి నిర్ణయంతో దేశం తిరోగమనంలోకి వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.