కాబూల్‌లో మరోసారి బాంబు పేలుడు.. 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు
ఆఫ్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రవాదుల వరుస దాడులతో అమాయకులు బలవుతున్నారు. తాజాగా ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడుకు 9 మంది దుర్మరణం పాలయ్యారు.

ఆఫ్ఘనిస్థాన్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. ఉగ్రవాదుల వరుస దాడులతో అమాయకులు బలవుతున్నారు. తాజాగా ఆఫ్ఘాన్ రాజధాని కాబూల్‌లో బాంబు పేలుడుకు 9 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికిపైగా గాయపడ్డారు. ఆఫ్ఘనిస్థాన్ ఇంటీరియర్ మినిస్టర్ మసూద్ అందరాబి ఈ విషయాన్ని ధృవీకరించారు. ఆదివారం ఉదయం జనసమ్మర్థం ఎక్కువగా ఉన్నచోటును టార్గెట్ చేసుకుని ఉగ్రవాదులు ఘాతుకానికి పాల్పడినట్లు స్థానిక మీడియా అభిప్రాయపడింది. ఈ ఉదయం నడిరోడ్డుపై బాంబు పేలిందని, దీంతో మృతులు, క్షతగాత్రుల సంఖ్య పెరిగిందని టోలో న్యూస్ సంస్థ పేర్కొంది. కాగా, ఈ బాంబు దాడికి బాధ్యులు ఎవరనే విషయం తెలియాల్సి ఉందని ఆఫ్ఘనిస్థాన్ పోలీస్ అధికారులు తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేపట్టామన్నారు.