Narendra Modi Birthday: చర్చల సమయంలో మోడీ పుట్టిన రోజు ప్రస్తావనకు వచ్చినా పుతిన్ శుభాకాంక్షలు చెప్పలేదు.. ఎందుకంటే
Narendra Modi Birthday: సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ముందుగా..
Narendra Modi Birthday: సెప్టెంబర్ 17న భారత ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుభాకాంక్షలు తెలిపారు. అయితే ముందుగా అభినందనలు తెలిపేందుకు రష్యా సంప్రదాయం లేకపోవడంతో అలా చెప్పలేదు. అయితే రష్యా అధ్యక్షుడు పుతిన్ ఉజ్జెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో జరిగిన ఎస్‌సీఓ సమ్మిట్ సందర్భంగా శుక్రవారం జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో సెప్టెంబర్ 17న మోడీ 72వ పుట్టిన రోజును ప్రస్తావించారు. అయితే ఆ సమయంలో పుతిన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు మాత్రం చెప్పలేదు. ప్రియమైన మిత్రమా..? నువ్వు పుట్టిన రోజు జరుపుకోబోతున్నావు.. కానీ రష్యా సంప్రదాయం ప్రకారం మేము ముందుగా అభినందనలు చెప్పబోము. అందుకే నేను అలా చేయలేదు. మీకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నాను అని అన్నారు. మా సంప్రదాయం విషయం గురించి మాకు తెలుసని మీరు తెలుసుకోవాలని పుతిన్ కోరారు.
“Today’s era isn’t of war & I’ve spoken to you about it on the call. Today we’ll get the opportunity to talk about how can we progress on the path of peace. India-#Russia has stayed together for several decades”: PM Modi in bilateral meet with Russian President Putin#SCOSummit pic.twitter.com/Fsl6CtX6gO
— DD News (@DDNewslive) September 16, 2022
ప్రధాన ప్రాంతీయ భద్రతా సవాళ్లు, వాణిజ్యం, పెట్టుబడులు, ఇంధన సరఫరా వంటి సమస్యలపై చర్చించేందుకు చారిత్రాత్మక ఉజ్జెకిస్తాన్‌లోని సమర్‌కండ్‌లో రెండేళ్ల తర్వాత షాంఘై సహకార సహకార సంస్థ సదస్సుకు రష్యా, చైనా అధ్యక్షులతో పాటు భారత్, పాకిస్తాన్ ప్రధాన మంత్రులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పుతిన్ మోడీను ముచ్చటించారు. భారతదేశం మీ నాయకత్వంలో మరింతగా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని పుతిన్ అన్నారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి