PM Modi: సైప్రస్‌లో ప్రధాని మోదీ రెండో రోజు పర్యటన.. అత్యున్నత పురస్కారం ప్రదానం
ప్రధాని మోదీ సైప్రస్ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. మోదీ ఎక్కడికి వెళ్లినా ఘనస్వాగతం లభిస్తోంది. సైప్రస్ నికోస్ క్రిస్టోడౌలిడెస్ మోదీకి ఘనస్వాగతం పలికారు. మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూసేయండి. ఓ సారి లుక్కేయండి

ప్రధాని మోదీ సైప్రస్ పర్యటన బిజీబిజీగా కొనసాగుతోంది. మోదీ ఎక్కడికి వెళ్లినా ఘనస్వాగతం లభిస్తోంది. సైప్రస్ నికోస్ క్రిస్టోడౌలిడెస్ మోదీకి ఘనస్వాగతం పలికారు. మోదీకి సైప్రస్ అత్యున్నత పురస్కారాన్ని(గ్రాండ్ క్రాస్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ మాకరియోస్ III) ప్రదానం చేశారు. డిజిటల్ , స్టార్టప్ రంగాల్లో ఇరుదేశాలు పరస్పరం సహకరించుకోవాలని నిర్ణయించాయి. ప్రధాని మోదీకి ఇది 23వ అత్యున్నత పురస్కారం..
సైప్రస్ అధ్యక్షుడు నికోస్ క్రిస్టోడౌలిడెస్‌కు ధన్యవాదాలు తెలిపారు మోదీ. ఇది తనకు లభించిన గౌరవం కాదని 140 కోట్ల మంది భారతీయులకు లభించిన పురస్కారమన్నారు. సైప్రస్ అధ్యక్షుడితో ఉన్నతస్థాయి చర్చల్లో వాణిజ్యం, సాంకేతికత, విద్య, సాంస్కృతిక మార్పిడిలో సహకారాన్ని పెంచుకోవడంపై మోదీ దృష్టి పెట్టారు. ఈ పర్యటన భారత్-సైప్రస్ సంబంధాలను బలోపేతం చేస్తుందని, జి7 సదస్సుకు ముందు యూరోపియన్ దేశాలతో దౌత్య సంబంధాలను మెరుగుపరుస్తుందని భావిస్తున్నారు.
Humbled to receive the ‘Grand Cross of the Order of Makarios III’ of Cyprus. I dedicate it to the friendship between our nations. https://t.co/x4MX3UZbtW
— Narendra Modi (@narendramodi) June 16, 2025
