AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: మేకప్‌ ప్రొడక్ట్స్‌తో బీ అలర్ట్‌..! పాపం ఆ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్..

మేకప్‌ వేసుకోవడం చాలా మంది అమ్మాయిలకి ఇష్టం. అదీ గాక యూట్యూబ్‌ల పుణ్యమా అని ఎలా వేసుకోవాలో సులభంగా తెలుసుకుంటున్నారు. అయితే కొందరూ అత్యుత్సాహంతో చేసే పనులు చివరికి విషాదాన్ని మిగుల్చుతున్నాయి. డెర్మటాలజిస్ట్‌లు సైతం మేకప్‌ ప్రొడక్ట్స్‌ ఏవి కూడా కంటికి, నోటికి తగలకూడదని...

Viral Video: మేకప్‌ ప్రొడక్ట్స్‌తో బీ అలర్ట్‌..! పాపం ఆ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్..
Taiwan Makeup Influencer
K Sammaiah
|

Updated on: Jun 16, 2025 | 7:51 PM

Share

మేకప్‌ వేసుకోవడం చాలా మంది అమ్మాయిలకి ఇష్టం. అదీ గాక యూట్యూబ్‌ల పుణ్యమా అని ఎలా వేసుకోవాలో సులభంగా తెలుసుకుంటున్నారు. అయితే కొందరూ అత్యుత్సాహంతో చేసే పనులు చివరికి విషాదాన్ని మిగుల్చుతున్నాయి. డెర్మటాలజిస్ట్‌లు సైతం మేకప్‌ ప్రొడక్ట్స్‌ ఏవి కూడా కంటికి, నోటికి తగలకూడదని హెచ్చరిస్తుంటారు. వాటిల్లో ఉపయోగించే కెమికల్స్‌ వల్ల ప్రాణాంతక సమస్యలను ఎదుర్కొనాల్సి ఉంటుందని సూచిస్తుంటారు. కానీ చాలా మంది వీటిని పెడచెవిన పెట్టేస్తున్నారు. ఓ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ నిర్లక్ష్యంగా చేసిన పని ఆమె ప్రాణాలనే కోల్పయేలా చేసింది.

తైవాన్‌ దేశం బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్ మేకప్ ముక్‌బాంగ్‌కు ఇన్‌స్టాలో మంచి ఫాలోయింగ్‌ ఉంది. ఆమె మేకప్‌ వీడియోలకు వేలాది మంది అభిమానులున్నారు. సింపుల్‌ చిట్కాలతో చక్కగా మేకప్‌ వేసుకోవడం ఎలాగో చూపించడంతో పాటు..మధ్య మధ్యలో ఆ ప్రొడక్స్‌ టేస్ట్‌ చేస్తానంటూ కామెడీ చేసేది. ఒక్కోసారి నిజంగానే టేస్ట్‌ చేసి చూపించి నెటిజన్లలో ఉత్కంఠ రేపేది. ఆ క్రమంలోనే ఆమె యూట్యూబ్‌ వీడియోలకు మరింత క్రేజ్‌ పెరిగింది. ఈ అత్యుత్సాహమే ఆమె ప్రాణాలను ప్రమాదంలో పడేసింది. బుగ్గలకు పూసుకునే ఫౌండేషన్‌ దగ్గరి నుంచి లిప్‌స్టిక్‌ వరకు అన్ని టేస్ట్‌ చేసి..ఇది మరింత భయంకరంగా ఉంది అంటూ క్యూట్‌ ఎక్స్‌ప్రెషన్స్‌ ఇచ్చేది ఈ బ్యూటీ ఇన్‌ఫ్లుయెన్సర్

సోషల్‌ మీడియా స్టార్‌డమ్‌ కోసం చేసిస పనికి..పలు బ్రాండెడ్‌ కంపెనీ ఆమె వద్దకు క్యూ కట్టేవి. మంచి స్టార్‌డమ్‌ సంపాదించుకుంది కానీ ప్రాణాలను కాపాడుకోలేకపోయింది. ఆ మేకప్‌ ఉత్పత్తులను టేస్ట్‌ చేయడమే శాపమై ప్రాణాలను చేజేతులారా కోల్పోయేలా చేసింది. జస్ట్‌ 24 ఏళ్లకే నిండు నూరేళ్లు నిండిపోయాయి ఆమెకు. ఐతే అధికారికంగా ఆమె మరణానికి గల కారణం ఏంటనేది తెలియాల్సి ఉంది. కానీ ఆమె ఆకస్మికంగా అనారోగ్యం బారినపడి చనిపోయినట్లు బాధితురాలి కుటుంబం ప్రకటించింది.

దయచేసి ఇలాంటి వీడియోలను ప్రోత్సహించొద్దని గట్టిగా హెచ్చరిస్తున్నారు నిపుణులు. మేకప్‌ ప్రొడక్ట్స్‌లో వాడే కెమికల్స్‌ సాధారణంగా అందరి శరీరాలకి సరిపడవు. అలాంటి వాటిని టేస్ట్‌ చేసే సాహసం అస్సలు చెయ్యొద్దని చెబుతున్నారు. అంతేగాదు మేకప్‌ వేసుకోవడంలో ఎంత శ్రద్ధపెడతామో, తీసేటప్పుడూ కూడా అంతే కేర్‌ఫుల్‌గా ఉండాలంటున్నారు. మేకప్‌తో పడుకోవద్దని..ఎంత ఆలస్యమైనా..దాన్ని పూర్తిగా తొలగించాకే నిద్రపోవాలని తెలియచేస్తున్నారు.

వీడియో చూడండి: