PM Modi: నమీబియాలో అడుగుపెట్టిన మోడీ.. 21 గన్స్‌తో గ్రాండ్ వెల్‌కమ్..
ప్రధాని మోడీ నమీబియాలో పర్యటిస్తున్నారు. బ్రెజిల్ పర్యటన ముగించుకుని నమీబియా చేరుకున్న మోడీకి ఘన స్వాగతం లభించింది. 21 తుపాకీలతో కూడిన గౌరవ వందనాన్ని ఆయన స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. మోడీ సైతం డప్పు వాయించి అక్కడున్నవారిని ఉత్సాహపరిచారు.

ప్రధాని మోడీ విదేశీ పర్యటన కొనసాగుతోంది. 8 రోజుల పాటు ఐదు దేశాల టూర్‌కు వెళ్లిన మోడీ ఇప్పటికే నాలుగు దేశాల్లో పర్యటించారు. ప్రస్తుతం చివరి దేశమైన నమీబియాలో పర్యటిస్తున్నారు. నమీబియాలో ఆయనకు గ్రాండ్ వెల్‌కమ్ లభించింది. ఆ దేశ ప్రెసిడెంట్ నెటుంబో నంది స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి మోడీని రిసీవ్ చేసుకున్నారు. 21 గన్స్‌తో కూడిన గౌరవ వందనాన్ని మోడీ అందుకున్నారు. ఇది ప్రధాని చారిత్రాత్మక పర్యటన యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెబుతుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మోడీ స్వయంగా డప్పు వాయించి అక్కడున్నవారిని ఉత్సాహపరిచారు. మోడీ ఆ దేశంలో పర్యటిస్తున్న మూడో ప్రధాని. ఈ పర్యటనలో ఆయన అధ్యక్షులు నెటుంబో నందితో ద్వైపాక్షిక చర్చలు జరిపి నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగిస్తారు.
‘‘కొద్దిసేపటి క్రితమే విండ్‌హోక్‌లో అడుగుపెట్టాను. నమీబియా భారత్‌కు విలువైన, విశ్వసనీయ ఆఫ్రికన్ భాగస్వామి. ఆ దేశంతో ద్వైపాక్షిక సహకారాన్ని పెంపొందించుకుంటాం. ఆ దేశ ప్రెసిడెంట్‌తో భేటీతో పాటు నమీబియా పార్లమెంటును ఉద్దేశించి ప్రసంగించడానికి ఎదురుచూస్తున్నాను’’ అని మోడీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ప్రధాని పర్యటన సందర్భంగా ప్రవాస భారతీయులు సైతం ఆయనకు ఘనస్వాగతం పలికారు. వారిందరితో కరచాలనం చేసిన మోడీ గిఫ్టులను స్వీకరించారు.
VIDEO | Namibia: PM Modi (@narendramodi) receives a ceremonial welcome at the State House in Windhoek.
(Source: Third party)
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/fFSihZvey8
— Press Trust of India (@PTI_News) July 9, 2025
రెండు దేశాల మధ్య ఇంధన భద్రత, ఆరోగ్య సంరక్షణ, ఔషధాలు వంటి కీలక రంగాలలో సహకారానికి సంబంధించి కీలక ఒప్పందాలు జరగనున్నాయి. ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయడంలో మోడీ చేసిన కృషికి గుర్తింపుగా నమీబియా యొక్క అత్యున్నత పౌర పురస్కారాన్ని ఆయనకు ప్రదానం చేస్తారు. ఆ తర్వాత మోడీ అక్కడి పార్లమెంట్‌ను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
ప్రధాని మోదీ బ్రెజిల్‌లో రెండు రోజుల పర్యటనను ముగించుకుని నమీబియా చేరుకున్నారు. రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరై.. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియో లులా డ సిల్వాతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా దేశాల్లో పర్యటించారు.
#WATCH | PM Narendra Modi lands in Windhoek, Namibia, on the invitation of Namibian President Netumbo Nandi-Ndaitwah
This is the first visit of PM Modi to the country, and the third ever Prime Ministerial visit from India to Namibia.
(Video source: DD) pic.twitter.com/DjSOLme5P3
— ANI (@ANI) July 9, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
