PM Modi: ప్రధాని మోదీకి నమీబియా అత్యున్నత పురస్కారం..
ప్రధాని మోదీకి అరుదైన గౌరవం లభించింది. ప్రస్తుతం నమీబియా పర్యటనలో ఉన్న మోడీ.. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ ను అందుకున్నారు. నమీబియా ప్రెసిడెంట్ నెటుంబో నంది మోదీకి ఈ పురస్కారాన్ని అందజేశారు. 140 కోట్ల భారతీయుల తరఫున ఈ పురస్కారం తీసుకుంటున్నట్లు ప్రధాని చెప్పారు.

ప్రధాని మోదీ నమీబియాలో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయనకు అరుదైన గౌరవం దక్కింది. ఆ దేశ అత్యున్నత పౌర పురస్కారమైన ‘‘ఆర్డర్ ఆఫ్ ది మోస్ట్ ఏన్షియంట్ వెల్విట్చియా మిరాబిలిస్’’ పురస్కారాన్ని అందుకున్నారు. నమీబియా ప్రెసిడెంట్ నెటుంబో నంది మోదీకి ఈ పురస్కారాన్ని అందజేశారు. ఈ పురస్కారం పట్ల మోదీ సంతోషం వ్యక్తం చేశారు. ప్రెసిడెంట్ నెటుంబో నందితో పాటు నమీబియా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. 140కోట్ల భారతీయుల తరఫున ఈ పురస్కారాన్ని తీసుకుంటున్నట్లు చెప్పారు. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో 27 అవార్డులు అందుకోగా… ప్రస్తుత ఐదు దేశాల టూర్‌లో నాలుగు పురస్కారాలు అందుకున్నారు.
ఆ తర్వాత ప్రెసిడెంట్ నెటుంబో నందితో మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు. డిజిటల్ టెక్నాలజీ, రక్షణ, భద్రత, వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, ఖనిజాలు వంటి రంగాలలో పరస్పర సహకారంపై చర్చించారు. వాణిజ్యం, ఎనర్జీ, పెట్రోకెమికల్స్ వంటి అంశాలపై కీలక చర్చలు జరిపారు. అంతేకాకుండా నాలుగు ఇరుదేశాల మధ్య ఒప్పందాలు కుదిరాయి. ఇక నమీబియా పార్లమెంట్‌లో మోదీ ప్రసంగించారు. ఈ విదేశీ పర్యటనలో ఆయా దేశాల పార్లమెంట్‌లలో మోదీ ప్రసంగించడం ఇది మూడోసారి.
అంతకుముందు బ్రెజిల్ నుంచి నమీబియా చేరుకున్న మోదీకి ఘనస్వాగతం లభించింది. ఆ దేశ ప్రెసిడెంట్ నెటుంబో నంది స్వయంగా ఎయిర్ పోర్టుకు వెళ్లి మోదీని రిసీవ్ చేసుకున్నారు. 21 గన్స్‌తో కూడిన గౌరవ వందనాన్ని ప్రధాని స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మోదీ స్వయంగా డప్పు వాయించి అక్కడున్నవారిని ఉత్సాహపరిచారు. కాగా ప్రధాని మోదీ బ్రెజిల్‌లో రెండు రోజుల పర్యటనను ముగించుకుని నమీబియా చేరుకున్నారు. రియో డి జనీరోలో జరిగిన 17వ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశానికి ఆయన హాజరై.. బ్రెజిల్ అధ్యక్షుడు లూయిజ్ ఇనాసియోతో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. అంతకుముందు ఆయన ఘనా, ట్రినిడాడ్ అండ్ టొబాగో, అర్జెంటీనా దేశాల్లో పర్యటించారు.
VIDEO | Windhoek: Prime Minister Narendra Modi (@narendramodi) received Namibia’s highest civilian honour — The Order of the Most Ancient Welwitschia Mirabilis. Namibian President Dr. Netumbo Nandi-Ndaitwah (@SWAPOPRESIDENT) conferred the award during a formal ceremony.
(Source:… pic.twitter.com/BJD4NRyDcK
— Press Trust of India (@PTI_News) July 9, 2025
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
