AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

News9 Global Summit: నేడు న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రసంగించనున్న మోదీ..

న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌ను జర్మీనీ ఎడిషన్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. గురువారం ప్రారంభమైన ఈ సమ్మిట్‌లో భారత్‌కు చెందిన పలువురు కేంద్ర మంత్రులతో పాటు జర్మనీ అధికారులు, నాయకులు పాల్గొన్నారు. కాగా రెండో రోజైన నేడు ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. ఈరోజు పలు ఆసక్తికరమైన అంశాలు చర్చకు రానున్నాయి..

News9 Global Summit: నేడు న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రసంగించనున్న  మోదీ..
Pm Modi In News9 Global Summit
Narender Vaitla
|

Updated on: Nov 22, 2024 | 7:18 AM

Share

టీవీ నెట్‌వర్క్‌కు చెందిన న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌ జర్మన్‌ ఎడిషన్‌లో నేడు (శుక్రవారం) భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించనున్నారు. గ్లోబల్‌ సమ్మిట్‌ రెండో రోజు ప్రధాని పాల్గొంటున్నారు. కాగా అందుకు ముందు మోదీ జర్మనీకి చెందిన నాయకులు, కార్పొరేట్‌ నాయకులతో పాటు పలువురు ప్రముఖ క్రీడకారులతో భేటీ కానున్నారు.

ఈ గ్లోబల్‌ సమ్మిట్‌లో ప్రధాని గ్రీన్ ఎనర్జీ, ఏఐ, డిజిటల్ ఎకానమీ స్కిల్ డెవలప్‌మెంట్‌ వంటి అంశాలపై చర్చించనున్నారు. కాగా న్యూస్‌9 గ్లోబల్‌ సమ్మిట్‌ తొలిరోజు (గురువారం) భారత్‌, జర్మనీల మధ్య స్థిరమైన అభివృద్ధికి సంబంధించిన రోడ్‌మ్యాప్‌పై మేధోమధనం జరిగింది. ఇందులో భారత కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్, జ్యోతిరాదిత్య సింధియా సహా జర్మనీ పెద్ద నేతలు పాల్గొన్నారు. ఇక నేడు టీవీ9 నెట్‌వర్క్‌ ఎండీ, సీఈఓ బరున్‌ దాస్‌ స్వాగత ప్రసంగంతో రెండో రోజు సమ్మిట్‌ ప్రారంభం కానుంది.

అనంతరం జర్మనీ ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ మినిస్టర్‌ సెమ్ ఓజ్డెమిర్ శిఖరాగ్ర సమావేశంలో ప్రసంగిస్తారు. అలాగే భారత్‌ జర్మనీల విధాన రూపకర్తలు రెండు దేశాల స్థిరమై అభివృద్ధి గురించి చర్చిస్తారు. ఇందులో గ్రీన్ ఎనర్జీ, ఏఐ, డిజిటల్ ఎకానమీ, స్కిల్ డెవలప్‌మెంట్‌తో పాటు భారత రక్షణ పరిశ్రమ, నేటి యునికార్న్‌పై చర్చలు జరగనున్నాయి. ఈరోజు కార్యక్రమంలో పోర్షే, మారుతీ, సుజుకీ, మెర్సిడెస్ బెంజ్, భారత్ ఫోర్స్‌త పాటు.. ఇరు దేశాలకు చెందిన అనేక వ్యాపార సంస్థలు.. ఇండో జర్మన్ ఛాంబర్ ఆఫ్ కామర్, ASSOCHAM వంటి వాణిజ్య సంఘాల ప్రతినిధులు పాల్గొంటారు.

ఇక ప్రధాని నరేంద్రమోదీ ప్రసంగం ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. ఇండియా: ఇన్‌సైడ్ ది గ్లోబల్ బ్రైట్ స్పాట్ అనే అంశంపై ఆయన ప్రసగించనున్నారు. దీంతో ప్రధాని ఏం మాట్లాడుతార్నదానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. అలాగే ఈరోజు గ్రీన్ ఎనర్జీ గురించి ఫ్రాన్‌హోఫర్ డైరెక్టర్ ఆండ్రియాస్ బేట్, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అజయ్ మాథుర్, TERI డిజి విభా ధావన్, హీరో ఫ్యూచర్ ఎనర్జీ సిఎండి రాహుల్ ముంజాల్ చర్చిస్తారు.

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ గురించి.. గ్లోబల్ ఇండస్ట్రీ సెక్టార్ లీడ్ సప్లయర్ పార్టనర్ స్టెఫాన్, AI లాంగ్వేజ్ టెక్ హెడ్ డాక్టర్ జాన్ నీహుయిస్, టెక్ మహీంద్రా యూరప్ హెడ్ హర్షుల్ అన్సానీతో పాటు మైక్రోన్ ఇండియా MD ఆనంద్ రామమూర్తి చర్చిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..

ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
ఈ మహిళ సక్సెస్ స్టోరీ వింటే సెల్యూట్ చేయాల్సిందే
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
పవర్‌ఫుల్ గ్రహాల ఎంట్రీ.. డబుల్ రాజయోగంతో ఈ 4 రాశులకు డబుల్...
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
వారెవ్వా అదిరే బైక్.. ఎక్కువ మైలేజ్.. చాలా తక్కువ ధర.. సూపర్..
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
ఇంకెన్నాళ్లు జుట్టుకు రంగు వాడతారు.. దానిమ్మ తొక్కల్ని ఇలా వాడితే
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
30 ఏళ్ల క్రితం సినిమా క్లాసిక్ హిట్.. ఇప్పటికీ ట్రెండ్ అవుతున్న ప
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
రేపటితో టీమిండియా 5 ఏళ్ల రికార్డు మటాష్ అవుతుందా?
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
ఓటీటీలో సుదీప్ లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు.. మహిళలు, బీసీలకు..
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
మరోసారి పోలీస్ పాత్రలో రాణీ ముఖర్జీ.. మ్యాజిక్ రిపీట్ అవుతుందా?
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే
బిగ్ బ్రేక్ కోసం ఎదురుచూస్తున్న షాలిని పాండే