PM Modi: ఇరు దేశాలను క్రికెట్ కలిపింది.. క్రీడాకారులతో ప్రధాని మోదీ..
భారత ప్రధాని ప్రస్తుతం విదేశీ పర్యటనలో బిజీబిజీగా గడుపుతున్నారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా విదేశాల్లో ఉన్న మోదీ గురువారం గయానాలో పర్యటించారు. ఇందులో భాగంగానే పలువురు క్రికెటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కరేబియన్ దేశాలతో భారత్‌కు ఉన్న సంబంధాల గురించి ఆయన ప్రస్తావించారు. ఈ విషయాన్ని ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు..
భారత ప్రధాని నరేంద్రమోదీ మూడు దేశాల పర్యటనలో భాగంగా గురువారం గయానాలో ఉన్నారు. ఇందులో భాగంగానే గురువారం గయానాలోని క్రికెటర్లతో ఆయన సమావేశమయ్యారు. ఈ విషయమై ఆయన ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. క్రికెటర్లతో దిగిన ఫొటోను షేర్ చేశారు. క్రికెటర్లతో ఆహ్లాదకరమైన సంభాషణ జరిగిందన్న ప్రధాని. కరేబియన్ దేశాలతో భారత్‌ను క్రికెట్ కలిపిందని అభిప్రాయపడ్డారు.
క్రికెట్ ఇరు దేశాల ప్రజలను మరింత దగ్గర చేసిందని, సాంస్కృతిక సంబంధాల బలోపేతానికి క్రికెట్ కారణమైందన్నారు. ఇక అంతకుముందు మోదీ వెస్టిండీస్‌కు చెందిన క్రికెట్ ప్రముఖులతో సమావేశమయ్యారు. భారత్‌ను కరేబియన్ దేశాలతో కలిపే ఏకైక బంధంగా క్రికెట్ పనిచేస్తుందని మోదీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఇక గయానా దేశాన్ని 50 ఏళ్ల తర్వాత తొలిసారి సందర్శిన ప్రధానిగా మోదీ నిలిచారు.
గయానా అధ్యక్షుడు ఇర్ఫాన్ అలీతో పాటు ప్రముఖ క్రికెటర్లను మోదీ గురువారం కలిశారు. ఈ వషయాన్ని విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎక్స్ వేదికగా తెలిపారు. ‘స్నేహపూర్వక ఇన్నింగ్స్! ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, గయానా అధ్యక్షుడు డాక్టర్ మహమ్మద్ ఇర్ఫాన్‌తో కలిసి వెస్టిండీస్‌కు చెందిన ప్రముఖ క్రికెట్ ప్రముఖులను ఈరోజు జార్జ్‌టౌన్‌లో కలిశారు అని ఈ పోస్టులో రాసుకొచ్చారు.
Connecting over cricket!
A delightful interaction with leading cricket players of Guyana. The sport has brought our nations closer and deepened our cultural linkages. pic.twitter.com/2DBf2KNcTC
— Narendra Modi (@narendramodi) November 21, 2024
ఇక కరేబియన్ దేశాలతో భారత్‌కు ఉన్న అనుబంధం గురించి ప్రధాని మోదీ మాట్లాడుతూ. మరే ఇతర మాధ్యమం లేని విధంగా కరేబియన్ దేశాలతో క్రికెట్ భారత్‌ను కలుపుతుందని అన్నారు. కాగా 17 సంవత్సరాలలో పశ్చిమ ఆఫ్రికా దేశానికి భారత ప్రధాని చేసిన మొదటి పర్యటన ఇదే కావడం విశేషం. ఇక అక్కడి నుంచి ప్రధాని మోదీ బ్రెజిల్ వెళ్లారు. జీ20 సదస్సులో పాల్గొనేందుకు మోదీ బ్రెజిల్ వెళ్లారు. అమెరికా అధ్యక్షుడు జో బిడెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌త పాటు బ్రిటిష్ ప్రధాని కైర్ స్టార్మర్‌తో పలువురు ప్రపంచ నాయకులను కలిశారు.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..