67 మంది ప్రయాణికులతో నింగిలో విమానం.. హెలికాప్టర్ ఢీ.. ఆ భయానక దృశ్యాలు చూస్తే..
ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 67 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు అమెరికా ప్రకటించింది. మానవ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం అనంతరం విమాన శకలాలు పోటోమాక్ నదిలో పడిపోవడంతో మరణాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు.

అమెరికా రాజధాని వాషింగ్టన్‌లో ఘోర ప్రమాదం జరిగింది. యుఎస్‌లోని వాషింగ్టన్ డిసిలో పోటోమాక్ నదిలో విమానం కూలిపోయింది. రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ నేషనల్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకునే క్రమంలో హెలికాప్టర్‌ను ఆర్మీ హెలికాప్టర్ ఢీకొట్టింది. ఈ ఘటనలో విమానంలో ఉన్న మొత్తం 67 మంది ప్రయాణికులు మృతి చెందినట్టు అమెరికా ప్రకటించింది. మానవ తప్పిదం వల్లే ఈ ఘటన జరిగిందని అధికారులు భావిస్తున్నారు. ప్రమాదం అనంతరం విమాన శకలాలు పోటోమాక్ నదిలో పడిపోవడంతో మరణాల సంఖ్య పెరిగినట్టు తెలుస్తోంది. ఆ దేశ చరిత్రలో ఇదే అతిపెద్ద ప్రమాదంగా చెబుతున్నారు.
వీడియో ఇక్కడ చూడండి..
BREAKING: Mid-air collision between a helicopter and commercial jet on approach to Ronald Reagan Washington National Airport. Rescue boats are scanning the Potomac River. pic.twitter.com/ySwHFq9Ej1
— Breaking 4 News (@Breaking_4_News) January 30, 2025
అమెరికన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 5342 DC విమానాశ్రయం సమీపంలో బ్లాక్ హాక్ హెలికాప్టర్‌ను ఢీకొట్టిందని సమాచారం. ప్రమాదానికి సంబంధించిన వీడియోలో రెండు విమానాలు ప్రకాశవంతమైన మంటలతో ఢీకొన్నట్లు చూపిస్తుంది.
Learning that a plane inbound from Kansas was involved in a crash at DCA.
I am in contact with authorities.
Please join me in praying for all involved.
— Senator Jerry Moran (@JerryMoran) January 30, 2025
ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. సహాయ కార్యక్రమాలను అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.
ఇది కూడా చదవండి: పులి మూత్రం అమ్ముతున్న జూ నిర్వాహకులు.. ఒక్క సీసా ఎంతో తెలుసా..?
ఇది కూడా చదవండి: అంతా మనదే.. ఉద్యోగులకు ఏకంగా రూ. 70 కోట్ల బోనస్.. కానీ ఒక్క కండీషన్
ఇది కూడా చదవండి: బీచ్‌లో వాకింగ్ చేస్తున్న వ్యక్తి కాలికి తగిలిన అదృష్టం..అదేదో చెత్తాచెదారం అనుకుంటే.. 66 మిలియన్ల..!