నరేంద్రుడినే ఫిదా చేసిన విక్కీ కౌషల్ ఛావా వీడియో
విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ఛావా. మరాఠా రాజు ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఛత్రపతి శంభాజీ మహారాజ్ పాత్రలో నటుడు విక్కీ కౌశల్ అద్భుతంగా నటించి మెప్పించాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14, 2025న థియేటర్లలో విడుదలైంది. తొలి షోతోనే ఛావా సినిమా ఆ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. భారీగా వసూళ్లు రాబడుతోంది. ఈక్రమంలోనే ఛావా సినిమాపై నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించాడు. ఎస్ ఇప్పటికే ఛావా సినిమా పై అంతటా ప్రశంసలు వర్షం కురుస్తోంది. విక్కీ నటనతో మరోసారి దేశ ప్రజలు ఛత్రపతి శివాజీని ఆయన కుమారుడు శంభాజీ మహారాజ్ ను తలుచుకుంటున్నారు. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు అందరూ ఈ సినిమా పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కూడా ఇప్పుడీ సినిమా గురించి మాట్లాడారు. ఇటీవల జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనం ప్రారంభోత్సవంలో ప్రధాని మోదీ ఛావా సినిమా పై ప్రశంసలు కురిపించారు. ఛావా సినిమా పేరు ప్రస్తుతం అంతటా వినిపిస్తోందని మోదీ అన్నారు. దేశంలో మరాఠీ భాష చాలా గొప్ప దళిత సాహిత్యాన్ని అందించిందని, మహారాష్ట్ర ప్రజలు గతంలో సైన్స్, ఆయుర్వేదం, లాజికల్, రీజనింగ్ వంటి వాటికి అద్భుతమైన కృషి చేశారని మోదీ అన్నారు. మహారాష్ట్ర, ముంబై కేవలం హిందీ సినిమాలు మాత్రమే కాకుండా మరాఠీ చిత్రాల స్థాయిని పెంచడంలో కీలక పాత్ర పోషించిందని మోదీ చెప్పుకొచ్చారు.
వైరల్ వీడియోలు

ఆచి.. తూచి.. అడుగు వెయ్యాలంటారు ఇందుకే..

కొంప ముంచిన కాఫీ.. ఏకంగా రూ.415 కోట్లు పరిహారం..

వేసవిలో బైక్ లు వాడుతున్నారా.. వీటితో జాగ్రత్త!

తాచుపాము కరిచినా..10వ తరగతి పరీక్ష రాసిన విద్యార్థి వీడియో

తెలుగు రాష్ట్రాల్లో బుసలు కొడుతున్న పాములు వీడియో

ఈ కోతికి ఫోన్ కనిపిస్తే చాలు.. వీడియో

ఎక్కడపడితే అక్కడ రీల్స్ చేస్తే ఇలాగే పగుల్తది..
