AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Machavaram: యూట్యూబ్‌ ఛానెల్‌ ముసుగులో స్పా సెంటర్‌.. ధనికులే టార్గెట్‌! 10 మంది అమ్మాయిలతో..

మాచవరం పోలీసులు స్పా సెంటర్ ముసుగులో నడిచే వ్యభిచార గృహాలను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ప్రసన్న భార్గవ్ అనే వ్యక్తి యూట్యూబ్ ఛానెల్ ద్వారా స్పా సెంటర్‌ను ప్రమోట్ చేస్తూ, అమ్మాయిలను వ్యభిచారంలోకి నెట్టి లక్షలాది రూపాయలు సంపాదించాడు. పోలీసులు దాడి చేసి అనేక మందిని అరెస్టు చేశారు. భార్గవ్ పరారీలో ఉన్నాడు. ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకొచ్చినట్లు అనుమానం.

Machavaram: యూట్యూబ్‌ ఛానెల్‌ ముసుగులో స్పా సెంటర్‌.. ధనికులే టార్గెట్‌! 10 మంది అమ్మాయిలతో..
Spa Center
SN Pasha
|

Updated on: Feb 23, 2025 | 10:52 AM

Share

డబ్బు సంపాదనకు అడ్డమైన దారులతో పాటు అడ్డమైన తెలివితేటలు కూడా వాడుతున్నారు కొందరు ప్రబుద్ధులు. ధనికులను టార్గెట్‌ చేసుకొని.. ఒక విషవలయాన్ని సృష్టిస్తున్నారు. జనాలను నమ్మించాడానికి ఒక ప్లాన్‌, డబ్బు కోసం ఇంకో ప్లాన్‌, బయట పడకుండా ఉండేందుకు మరో ప్లాన్‌ ఇలా.. ఒక క్రైమ్‌ నెట్‌వర్క్‌ను బిల్డ్‌ చేస్తున్నారు. తాజాగా ఓ వ్యక్తి యూట్యూబ్‌ ఛానెల్‌ పెట్టి స్పా సెంటర్‌ను ప్రమోట్‌ చేశాడు, ఆ స్పా సెంటర్‌ చూపించి వేరే రాష్ట్రాల అమ్మాయిలను రప్పించాడు, అలాగే డబ్బున్న వాళ్లను ఎట్రాక్ట్‌ చేసి.. అమ్మాయిలతో బలవంతంగా ఆ పనులు చేయిస్తూ.. వారిని వ్యభిచార రొంపిలోకి దింపాడు. ఈ బండారం బయటపడకుండా యూట్యూబ్‌ న్యూస్‌ ఛానెల్‌ను, ఓ పార్టీని కూడా అడ్డుపెట్టుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

స్పా సెంటర్ల ముసుగులో నిర్వహిస్తున్న వ్యభిచార గృహాలపై మాచవరం పోలీసులు దాడి చేశారు. వెటర్నరీ కాలనీ సర్వీస్‌ రోడ్డు సమీపంలో స్టూడియో 9, ఏపీ 23 పేరుతో చలసాని ప్రసన్న భార్గవ్‌ ప్రైవేట్‌ యూ ట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నాడు. ఆ బిల్డింగ్‌ పై భాగంలో స్పా సెంటర్‌ నిర్వహిస్తున్నాడు. యూట్యూబ్‌ చానల్‌ నిర్వహిస్తున్నట్లు నమ్మించి ఆ ముసుగులో స్పా సెంటర్‌లో వ్యభిచార గృహం నడుపుతున్నాడు. ఇతర రాష్ట్రాల నుంచి అమ్మాయిలను అక్రమంగా రప్పించి వ్యభిచార రొంపిలోకి దింపుతున్నాడు. బడా బాబులను టార్గెట్‌ చేసి లక్షలాది రూపాయలు దండుకున్నాడు.

అయితే ఆ బిల్డింగ్‌లో వ్యబిచారం జరుగుతున్నట్లు సమాచారం అందుకున్న మాచవరం పోలీసులు.. శుక్రవారం రాత్రి దాడి చేశారు. అక్కడ ఉన్న పది మంది అమ్మాయిలను, 13 మంది విటులను అదుపులోకి తీసుకున్నారు. వారిని స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే పోలీసులు దాడి చేస్తున్నారని తెలుసుకున్న భార్గవ్‌ అక్కడి నుంచి పరార్‌ అయ్యాడు. అతడిని పట్టుకునేందుకు పోలసులు గాలిస్తున్నారు. భార్గవ్‌కు పలు వ్యభిచార ముఠాలతో సత్సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. యూ ట్యూబ్‌ చానల్‌ పేరుతో ధనికులను, అధికారులను బెదిరించి వసూళ్లకు పాల్పడుతున్నట్లు కూడా అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఓ పార్టీలో కీలక నేతగా కూడా చెలామణి అవుతున్నట్లు సమాచారం.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
మెస్సీ కోల్‌కతా పర్యటన.. కోర్టు మెట్లెక్కిన భారత మాజీ కెప్టెన్
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
కెప్టెన్‌తో గొడవ.. కట్ చేస్తే.. 6 బంతుల్లో ఉతికారేసిన బౌలర్..
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
మరో 2రోజుల్లో తెలంగాణ సెట్ 2025 పరీక్షలు.. హాల్ టికెట్ల లింక్ ఇదే
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఈ సారి తేడా కొట్టిందో డీజే మోతే.. అంతటా డేగ కన్ను
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
ఖాళీ కడుపుతో వీటిని తిన్నారో మీ పని అయిపోయినట్లే.. ఈ సమస్యలు..
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కొత్త బీమా సవరణ బిల్లు 2025కే ఆమోదం!
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
కేకేఆర్‌కు దిమ్మతిరిగే షాకిచ్చిన రూ. 9.2 కోట్ల ప్లేయర్..
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
నేటి నుంచే హైదరాబాద్ బుక్ ఫెయిర్ 2025 షురూ.. టైమింగ్స్ ఇవే!
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
ఆస్కార్‌కు షార్ట్‌లిస్ట్ మూవీ హోమ్‌బౌండ్ ను ఏ ఓటీటీలో చూడొచ్చంటే?
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు
నిధి అగర్వాల్‌తో అనుచిత ప్రవర్తన.. వారిపై పోలీస్ కేసులు నమోదు