AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bank of Baroda Jobs: నిరుద్యోగులకు బలే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే బ్యాంకు కొలువులు!

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా బ్యాంకు ఉద్యోగం పొందే ఛాన్స్‌ వచ్చింది. బ్యాంక్ ఆఫ్‌ బరోడా రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది. సంబంధిత జాబ్‌కు సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ ఉంటే చాలు. ఈ బ్యాంకులో ఉద్యోగం పొందొచ్చు..

Bank of Baroda Jobs: నిరుద్యోగులకు బలే ఛాన్స్.. ఎలాంటి రాత పరీక్షలేకుండానే బ్యాంకు కొలువులు!
Bank Of Baroda Jobs
Srilakshmi C
|

Updated on: Feb 23, 2025 | 10:06 AM

Share

బ్యాంక్ ఆఫ్‌ బరోడా దేశ వ్యాప్తంగా ఉన్న పలు బ్రాంచుల్లో రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 518 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. సీనియర్‌ మేనేజర్‌, మేనేజర్‌-డెవలపర్‌ ఫుల్‌స్టాక్‌, ఆఫీస్‌-డెవలపర్‌, సీనియర్‌ మేనేజర్‌, ఆఫీసర్‌-క్లౌడ్ ఇంజినీర్‌, ఆఫీసర్‌-ఏఐ ఇంజినీర్‌, మేనేజర్‌-ఏఐ ఇంజినీర్‌, సీనియర్‌ మేనేజర్‌ ఏఐ ఇంజినీర్‌, ఆఫీసర్‌ ఏపీఐ డెవలపర్‌, మనేజర్‌ ఏపీఐ డెవలపర్‌, మేనేజర్‌- నెట్‌వర్క్‌ అడ్మినిస్ట్రేటర్‌, సీనియర్‌ మేనేజర్‌ డేటాబేస్‌ అడ్మినిస్ట్రేటర్‌ మొదలైన పోస్టులు భర్తీ చేయనున్నారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో మార్చి 11, 2025వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీఈ, బీటెక్‌, ఎంఈ, ఎంటెక్‌, ఎంసీఏ, సీఏ, సీఎఫ్‌ఏ, ఎంబీఏలో ఉత్తీర్ణత కలిగి ఉండాలి. అలాగే సంబంధిత విభాగంలో నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా పని అనుభవం కూడా ఉండాలి. పోస్ట్‌ గ్రేడ్-ఎంఎంజీ/ఎస్‌-3 పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధలు వయసు 27 నుంచి 37 ఏళ్లలోపు ఉండాలి. అలాగే ఎంఎంజీ/ఎస్‌-2 పోస్టులకు 24 నుంచి 34 ఏళ్లు, జేఎంజీ/ఎస్‌-1 పోస్టులకు 22 నుంచి 32 ఏళ్లు, ఎస్‌ఎంజీ/ఎస్‌-4 పోస్టులకు కు 33 నుంచి 43 ఏళ్ల వరకు గరిష్ఠ వయోపరిమితి ఉండాలి. దరఖాస్తు సమయంలో రిజిస్ట్రేషన్‌ ఫీజు కింద జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.600, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు రూ. 100 చొప్పున చెల్లించవల్సి ఉంటుంది.

ఎలాంటి రాత పరీక్ష లేకుండానే కేవలం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు పోస్ట్‌ గ్రేడ్- జేఎంజీ/ఎస్‌-1 పోస్టులకు రూ.48,480, ఎంఎంజీ/ఎస్‌-2 పోస్టులకు రూ.64,820, ఎంఎంజీ/ఎస్‌-3 పోస్టులకు రూ.85,920, ఎస్‌ఎంజీ/ఎస్‌-4 పోస్టులకు రూ.1,02,300 చొప్పున జీతంగా చెల్లిస్తారు. ఇతర వివరాలు ఈ కింది అధికారిక నోటిఫికేషన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో ఉద్యోగ నోటిఫికేషన్‌ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..