Arif Alvi: పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి కరోనా.. వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని రోజులకే సోకిన మహమ్మారి

Pakistan President: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. నానాటికీ పెరుగుతున్న కేసులతో అంతటా ఆందోళన నెలకొంది. సాధారణ ప్రజల నుంచి ఆయా దేశాలను పాలించే నేతలు

Arif Alvi: పాక్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీకి కరోనా.. వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని రోజులకే సోకిన మహమ్మారి
Pakistan President Arif Alvi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Mar 29, 2021 | 11:10 PM

Pakistan President: ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ విజృంభిస్తోంది. నానాటికీ పెరుగుతున్న కేసులతో అంతటా ఆందోళన నెలకొంది. సాధారణ ప్రజల నుంచి ఆయా దేశాలను పాలించే నేతలు కూడా కరోనా బారిన పడుతున్నారు. తాజాగా పాకిస్తాన్ అధ్యక్షుడు డాక్టర్ ఆరిఫ్ అల్వీకు సైతం కరోనావైరస్ నిర్థారణ అయింది. వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్న కొన్ని రోజులకే ఆయన వైరస్ బారిన పడ్డారు. ఈ మేరకు అల్వీ స్వయంగా మంగళవారం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.

తాను కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ.. శరీరంలో యాంటీ బాడీల అభివృద్ధి జరగలేదని అల్వీ పేర్కొన్నారు. మరో వారంలో రెండో డోసు కరోనా వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉందని, ఈ లోపే కరోనా సోకిందని ఆరిఫ్ తెలిపారు. రెండో డోస్ తీసుకున్న తర్వాతే యాంటీ బాడీల అభివృద్ధి జరుగుతుందని వెల్లడించారు. అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని.. కరోనా బాధితులందరికీ అల్లా తోడుగా ఉండాలని కోరుకుంటున్నా.. అంటూ ఆయన ట్విట్ చేశారు.

కాగా.. వారం రోజుల క్రితమే పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సైతం కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకున్న కొన్ని రోజులకే వైరస్ బారిన పడటం గమనార్హం. అయితే.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ కొంతమందికి వైరస్ సోకుతున్న విషయం తెలిసిందే.

Also Read:

IIIT Student Suicide: హాస్టల్‌ గదిలో ఉరేసుకొని చనిపోయిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని.. ప్రేమ వ్యవహారమే కారణం.?

Fake Accounts In Facebook: ‘అర్జెంట్‌గా డబ్బులు పంపించు’ అంటూ మీకు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ వస్తుందా.? అయితే ఇది తెలుసుకోండి..