Woman Growing Beard: యువతికి 15 ఏళ్లుగా పెరుగుతున్న గడ్డం.. ఆమె మాత్రం షేవింగ్‌కు నో.. రీజన్ ఇదే
నబ్రస్కాకు చెందిన 27 ఏళ్ల క్లేడే వార్రెన్ అనే యువతితికి కౌమార దశలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు ముఖం మీద వెంటుకలు వచ్చాయి. అయితే, ఆమె వాటిని తొలగించాలనుకోలేదు. అలాగే ఉంచుకోవాలని డిసైడ్ అయ్యింది
Updated on: Mar 29, 2021 | 10:23 PM

అమ్మాయిలు గుబురు గడ్డం ఉన్న అబ్బాయిల్ని ఎక్కువగా ఇష్టపడతారు. వారి శరీరం మీద చిన్న వెంటుక కనిపిస్తేనే తెగ టెన్షన్ పడతారు. వెంటనే బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వాటిని తీయిస్తారు.

అయితే, అమెరికాకు చెందిన ఓ యువతికి మాత్రం యువకుల మాదిరి ముఖం మీద వెంట్రుకలు వచ్చినా కూడా లైట్ తీసుకుంది. పైగా, ఈ స్టైలే తనకి నచ్చిందని..వాటిని షేవ్ చేయకుండా అలాగే పెంచుకుంటుంది. తల్లిదండ్రుల ఎంత మొత్తుకున్నా సరే ఆమె గడ్డం పెంచుకోడానికే సిద్ధమైంది.

క్లేడే వార్రెన్‌కు టీనేజ్‌లో ఉన్నప్పుడు ముఖం మీద వెంటుకలు వచ్చాయి. ఇప్పుడామెకు 27 ఏళ్లు. ఇన్ని సంవత్సరాలలో కనీసం ఆమె వాటిని తీసివేసే ప్రయత్నం కూడా చేయలేదు. మిత్రులు, సన్నిహితులు ఎగతాళి చేసినా ఆమె లైట్ తీసుకుంది. తనకు గడ్డం ఉండటమే ఇష్టమని చెబుతుంది.

మన చర్మంతో ఎప్పుడు సౌకర్యవంతంగా ఉండాలి. లోపాలను పట్టించుకోకూడదు ఆమె చెబుతోంది.

పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ సమస్య వల్ల అమ్మాయిల్లో కూడా రోమాలు విపరీతంగా పెరుగుతాయి. కాగా క్లేడే మాత్రం ఈ సమస్యపై ఏ రోజు వైద్యులను సంప్రదించలేదు.
