Balaraju Goud |
Updated on: Mar 29, 2021 | 9:23 PM
ఈజిప్టులోని సూయెజ్ కాలువలో ఎగర్ గివెన్ అనే అతి భారీ కంటైనర్ నౌక చిక్కుకుని అంతర్జాతీయ జల రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇలాంటి ఘటననే అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగింది.
ఫ్లోరిడాలోని క్రెస్ట్ క్రూ ప్రాంతంలో ఇంటర్‌స్టేట్ హైవేపై ..రోడ్డుకు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. దాదాపు మూడు గంటల పాటు రాకపోకలు నిలిచిపోయాయి.
మార్చి 25న రాత్రి 8 గంటల సమయంలో ఓ ట్రక్కు పడవను తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ట్రయలర్‌పై పడవను ఉంచి దాన్ని ట్రక్కుకు కట్టి లాక్కెళ్లారు. అయితే క్రెస్ట్‌వ్యూ సమీపంలో అది ట్రక్కు నుంచి విడిపోయి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది.
పడవ ప్రమాదాన్ని నెటిజన్లు సూయజ్ కాల్వలో చిక్కుకుపోయిన ఎవర్‌గివెన్ షిప్‌తో పోల్చుతున్నారు. అక్కడ ఆ పడవ సూయజ్ కాల్వను బ్లాక్ చేస్తే.. ఇక్కడ ఈ పడవ హైవేను బ్లాక్ చేసిందని జోకులు పేల్చుతున్నారు.
క్రెస్ట్‌వ్యూ ఫైర్ డిపార్ట్‌మెంట్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని.. దాదాపు 3 గంటల పాటు శ్రమించి ఆ పడవను అక్కడి నుంచి తరలించారు. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు.
ఫ్లోరిడాలోని జాతీయ రహదారిపై పడవ అడ్డంగా పడిపోవడంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.