AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IIIT Student Suicide: హాస్టల్‌ గదిలో ఉరేసుకొని చనిపోయిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని.. ప్రేమ వ్యవహారమే కారణం.?

IIIT Student Suicide In Srikakulam: సిద్ధిపేట మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య ఉదంతం మరిచిపోక ముందే మరో దారుణం జరిగింది. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థిని అనాలోచిత నిర్ణయంతో..

IIIT Student Suicide: హాస్టల్‌ గదిలో ఉరేసుకొని చనిపోయిన ట్రిపుల్‌ ఐటీ విద్యార్థిని.. ప్రేమ వ్యవహారమే కారణం.?
Iiit Student Suicide In Sri
Narender Vaitla
|

Updated on: Mar 29, 2021 | 9:16 PM

Share

IIIT Student Suicide In Srikakulam: సిద్ధిపేట మెడికల్‌ కాలేజీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య ఉదంతం మరిచిపోక ముందే మరో దారుణం జరిగింది. ఎంతో బంగారు భవిష్యత్తు ఉన్న ఓ విద్యార్థిని అనాలోచిత నిర్ణయంతో తనువు చాలించింది. ఈ సంఘటన నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. కాకినాడ గాంధీనగర్‌లోని గొల్లపేటకు చెంది మాధురి (20) అనే విద్యార్థిని నూజివీడు ట్రిపుల్‌ ఐటీలో సివిల్‌ ఇంజనీరింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. అయితే ఈ క్రమంలోనే తాజాగా సోమవారం స్నేహితులంతా భోజనం చేయడానికి వెళ్లినా.. మాధురి మాత్రం వెళ్లకుండా ఒంటరిగా గదిలోనే ఉండిపోయింది. దీంతో గదిలో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భోజనం చేసి తిరిగొచ్చిన తోటి విద్యార్థినిలు ఈ విషయాన్ని గమనించి ఉపాధ్యాయులకు వెల్లడించారు. దీంతో విషయం తెలసుకున్న యాజమాన్యం పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్సై గణేశ్‌ బాబు మృతదేహాన్ని పరిశీలించి పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపడుతున్నారు. ఇదిలా ఉంటే విద్యార్థిని బలవన్మరణానికి ప్రేమ వ్యవహారమే కారణమని వార్తలు వస్తున్నాయి. ఉజ్వల భవిష్యత్తు ఉన్న విద్యార్థిని ఇలా బలవంతంగా తనువు చాలించడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: Fake Accounts In Facebook: ‘అర్జెంట్‌గా డబ్బులు పంపించు’ అంటూ మీకు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ వస్తుందా.? అయితే ఇది తెలుసుకోండి..

Murder: నారాయణపేట జిల్లా మక్తల్‌ శివారులో యువతి దారుణ హత్య.. దుండగుల కోసం పోలీసుల గాలింపు

Bride Arrest: పెళ్లి కొడుకు నచ్చాడంటుంది.. పెళ్లికి కూడా సిద్ధమవుతుంది.. కానీ.. అసలు కథ అప్పుడే స్టార్ట్..

ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
ప్రతి రోజూ ఉదయాన్నే దానిమ్మ జ్యూస్‌ తాగితే ఇన్ని లాభాలా..?
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
సమంతతో పాటు రెండో పెళ్లి చేసుకున్న తెలుగు హీరోయిన్స్ వీరే!
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
అయ్యగారి కోసం రంగంలోకి పాన్ ఇండియా డైరెక్టర్..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
చికెన్ Vs మటన్: ప్రోటీన్ ఎందులో ఎక్కువ ఉంటుంది.. ఆరోగ్యానికి..
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ కాంబోలో మిస్సైన క్రేజీ మూవీ ఇదే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!