Murder: నారాయణపేట జిల్లా మక్తల్‌ శివారులో యువతి దారుణ హత్య.. దుండగుల కోసం పోలీసుల గాలింపు

Murder: నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని గుర్తు తెలియని దుండగులు దారుణ హత్య చేశారు. యువతి దారుణ హత్యపై గ్రామంలో కలకలం రేపుతోంది....

Murder: నారాయణపేట జిల్లా మక్తల్‌ శివారులో యువతి దారుణ హత్య.. దుండగుల కోసం పోలీసుల గాలింపు
Murder
Follow us
Subhash Goud

|

Updated on: Mar 29, 2021 | 1:55 PM

Murder: నారాయణపేట జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఓ యువతిని గుర్తు తెలియని దుండగులు దారుణ హత్య చేశారు. యువతి దారుణ హత్యపై గ్రామంలో కలకలం రేపుతోంది. మక్తల్‌ శివారులోని వడ్వాట్‌ గ్రామానికి వెళ్లే మార్గంలో ఓ యువతిని దుండగులు కాల్చి చంపారు. మద్యం మత్తులో ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. యువతి హత్యకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఘటన స్థలానికి డాగ్‌ స్వ్కాడ్‌ను రప్పించి పరిశీలించారు. హత్యకు పాల్పడిన దుండగుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

ఇవీ చదవండి: Cyber Crime: మీకు ఇలాంటి ఫోన్ కాల్స్‌ వస్తున్నాయా..? ఈ నెంబర్లకు సమాచారం అందించండి: సైబర్‌ క్రైమ్‌ పోలీసులు

నాన్నా.. త్వరగా రండి.. నన్ను బయటకు తీయండి.. బస్సు చక్రాల కింద నలిగి.. చికిత్స పొందుతూ మృతి

Criminal Encounter: తప్పించుకున్న 72 గంటల్లోనే పోలీసుల చేతుల్లో ఎన్‌కౌంటర్‌ అయిన కరుడుగట్టిన నేరగాడు