AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Criminal Encounter: తప్పించుకున్న 72 గంటల్లోనే పోలీసుల చేతుల్లో ఎన్‌కౌంటర్‌ అయిన కరుడుగట్టిన నేరగాడు

Criminal Encounter: గోగా గ్యాంగ్‌కు చెందిన పేరుమోసిన నేరగాడు కుల్‌దీప్‌ పజ్జా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆదివారం స్పెషల్‌ సెల్‌ టీమ్‌ పోలీసులు అతన్ని కాల్చి .

Criminal Encounter: తప్పించుకున్న 72 గంటల్లోనే పోలీసుల చేతుల్లో ఎన్‌కౌంటర్‌ అయిన కరుడుగట్టిన నేరగాడు
Criminal Encounter
Subhash Goud
|

Updated on: Mar 28, 2021 | 6:04 PM

Share

Criminal Encounter: గోగా గ్యాంగ్‌కు చెందిన పేరుమోసిన నేరగాడు కుల్‌దీప్‌ పజ్జా ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడు. ఆదివారం స్పెషల్‌ సెల్‌ టీమ్‌ పోలీసులు అతన్ని కాల్చి చంపారు. పోలీసుల నుంచి తప్పించుకున్న 72 గంటల్లోనే కుల్‌దీప్‌ హతం కావడం గమనార్హం. మార్చి 25వ తేదీన కుల్‌ దీప్‌ వైద్య సహాయం నిమిత్తం జీబీటీ ఆస్పత్రికి వచ్చాడు. అయితే విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని పట్టుకోవడానికి ఆస్పత్రికి వెళ్లారు. ఈ నేపథ్యంలో కుల్‌దీప్‌ గ్యాంగ్‌ పోలీసులపై కారంపొడి చల్లి కాల్పులకు తెగబడింది. దీంతో పోలీసులు ఎదురు కాల్పులకు దిగారు. అనుచరుల సహాయంతో అతడు తప్పించుకున్నాడు.

కుల్‌దీప్‌ గ్యాంగ్‌లోని ఓ దుండగుడు మృతి చెందాడు. పోలీసుల నుంచి తప్పించుకున్న అతడు రోహిణీలోని ఓ ప్లాట్‌లో తలదాచుకున్నాడు. ఇక ఆ నేరగాడి కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. అతడిని ట్రాక్‌ చేసి బిల్డింగ్‌ను చుట్టుముట్టి లొంగిపోవాలని హెచ్చరికలు జారీ చేశారు. దీంతో లెక్క చేయని కుల్‌దీప్‌ పోలీసులపై కాల్పులు జరిపారు. పోలీసులు కూడా అతడిపై ఎదురు కాల్పులు జరపడంతో కుల్‌దీప్‌ హతమయ్యాడు. కాగా, గత మార్చి నెలలో ఢిల్లీకి చెందిన ప్రత్యేక సెల్‌ పోలీసులు అతడిని గురుగావ్‌లో అరెస్టు చేశారు.

బయటకు వచ్చిన తర్వాత కూడా అతడు తన పంధా మార్చకుండా నేరాలకు పాల్పడ్డాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అతని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పోలీసుల నుంచి తప్పించుకున్న72 గంటల్లోనే కాల్చి చంపారు.

ఇవీ చదవండి: జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఓ జవానుతో సహా ఇద్దరు ఉగ్రవాదుల మృతి, కొనసాగుతున్న కూంబింగ్

ఇండోనేసియాలోని చర్చిని టార్గెట్ చేసిన సూసైడ్ బాంబర్లు, అనేకమందికి గాయాలు

ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
ఎముకలు కొరికే చలిలో నడిరోడ్డుపై ప్రయాణీకులు
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
మొలకెత్తిన బంగాళాదుంపలు తింటే ఏమవుతుంది.. అసలు విషయం తెలిస్తే..
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
జీతం రూ.8 వేలు.. జీఎస్టీ మాత్రం రూ.13 కోట్లు.. అసలు మ్యాటర్
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
సింహం గర్జిస్తుంది.. 'మోగ్లీ' సినిమా న్యూ రిలీజ్ డేట్ వచ్చేసింది
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
బీజేపీ, కాంగ్రెస్‌ మధ్య యుద్ధంలో.. వందేళ్ల రాజకీయం!
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
6 సెకన్లలోనే 100 కి.మీ స్పీడ్‌.. ఈ రాకాసి కారు ఫీచర్లు చూస్తే
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
ఒక్క పనితో ఫ్యూచర్ సిటీకి గ్లోబల్ క్రేజ్.. దేశంలో ఏ కొత్త..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేస్తున్నారా..? అయితే ఈ విషయం తెలుసా..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
అయ్యో ఎంత ఘోరం.. ప్రేమించిన అమ్మాయిని దక్కించుకుందామని వెళ్తే..
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే
బాలయ్య 'అఖండ 2' రిలీజ్ టీజర్ చూశారా? గూస్‌బంప్స్ అంతే