జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఓ జవానుతో సహా ఇద్దరు ఉగ్రవాదుల మృతి, కొనసాగుతున్న కూంబింగ్

జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా వంగామ్ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు మరణించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను మరణించగా మరో జవాను గాయపడ్డాడు.

జమ్మూ కాశ్మీర్ లో ఎన్ కౌంటర్, ఓ జవానుతో సహా ఇద్దరు ఉగ్రవాదుల మృతి, కొనసాగుతున్న కూంబింగ్
2 Terrorists One Army Soldier Killed In Jammu Kashmir
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Mar 28, 2021 | 1:09 PM

జమ్మూ కాశ్మీర్ లోని షోపియాన్ జిల్లా వంగామ్ గ్రామంలో నిన్న రాత్రి జరిగిన ఎన్ కౌంటర్ లో ఇద్దరు టెర్రరిస్టులు మరణించారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఓ జవాను మరణించగా మరో జవాను గాయపడ్డాడు. అతడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.  ఘటనా స్థలంలో ఓ పిస్టల్ ను,ఏకే 47 రైఫిల్ ను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. కొంతమంది ఉగ్రవాదులు పారిపోయినట్టు భావిస్తున్నామని, వారికోసం  గాలిస్తున్నామని సైనికాధికారులు తెలిపారు. షోపియాన్ జిల్లాలో ఒక నెలలో ఎన్ కౌంటర్లు జరగడం ఇది మూడోసారి. గత రెండు ఎన్ కౌంటర్లలో టాప్ జైషే కమాండర్ సహా ఆరుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

శీతాకాలం ముగిసి సమ్మర్ వస్తుండడంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దొంగచాటుగా ఈ జిల్లా ద్వారా కాశ్మీర్ లోకి చొరబడేందుకు విశ్వ ప్రయత్నం చేస్తున్నారని మిలిటరీ అధికారులు అంటున్నారు. ఇక్కడి యువతను ఉగ్రవాద కార్యకలాపాల వైపు ప్రోత్సహించి వారిని ఉగ్రవాదులుగా, లేదా కాశ్మీర్ వేర్పాటువాదులుగా మార్చేందుకు  రహస్యంగా ఓ నెట్ వర్క్ ని నిర్వహిస్తున్నట్టు అనుమానిస్తున్నారు. ఇటీవల   ఓ యువ మిలిటెంట్ తాను లొంగిపోతానన్నట్టు చేతులు  పైకెత్తి అధికారుల ముందు లొంగిపోయిన వీడియోను మిలిటరీ రిలీజ్ చేసింది. ఆ సమయంలో అతని తండ్రి కూడా అక్కడే ఉన్నాడు. లొంగిపోయిన తనకుమారుడిపై ఎలాంటి చర్య తీసుకోకుండా వదిలిపెట్టాలని ఆ తండ్రి అభ్యర్థించాడు. బాగా చదువుకున్న విద్యార్థులు కూడాఉగ్రవాదం వైపు మరలడం అధికారులను ఆశ్చర్యపరుస్తోంది. ఎక్కువగా ఉద్యోగాల కోసం ఎదురు చూసే యువత ఇలా పెడమార్గం పడుతున్నారని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఉండగా భారత-పాకిస్దాన్ దేశాల  మధ్య కాల్పుల విరమణ ఒప్పందాన్ని మరింత సమర్థంగా అమలు చేయాలని ఇరు దేశాలూ తీర్మానించాయి. 2003 నాటి ఈ ఒప్పందానికి  కట్టుబడి ఉండాలని గత నెలలో హాట్ లైన్ ద్వారా ఇరు దేశాల మిలిటరీ అధికారులు  నిర్ణయించారు.

మరిన్ని చదవండి ఇక్కడ:జక్కన సర్‌ప్రైజ్ గిఫ్ట్‌కు.. షాకైన చెర్రీ..ఫిదా అవుతున్న నెటిజెన్లు..: Rajamouli Gift For Ram Charan Birthday Video.

తల్లిదండ్రులకు విజ్ఞప్తి ..తస్మాత్ జాగ్రత్త ..! మీలాంటి వారి కోసమే ఈ వీడియో..: Message For Parents Video.

టీనేజ్ కూతురితో మజాక్ చేస్తున్న నటి ప్రగతి.. వైరల్ అవుతున్న వీడియో : Actor Pragathi Viral Video.

ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
ట్రంప్‌ vs కమలా హారిస్.. భవిష్యత్తును నిర్ణయించేది ఆ 7 స్టేట్సే..
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
అమెరికా ఎన్నికల వేళ..గూగుల్‌ ఉద్యోగులకు సుందర్‌ పిచాయ్‌ వార్నింగ్
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
మళ్లీ రంగంలోకి.. ఆ ప్రాంతంలోని భూ ఆక్రమణలపై హైడ్రా ఫోకస్..
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
ఇన్‌స్టాగ్రమ్‌లో పరిచయం చేసుకున్నాడు.. చాటింగ్ చేశాడు.. చివరికి
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
యూపీ యోధాస్‌పై జైపూర్‌‌ ఉత్కంఠ విజయం..
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
సామ్‌సంగ్‌ నుంచి అద్భుతం.. 280 ఎంపీ కెమెరాతో వస్తోన్న కొత్త ఫోన్‌
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
యుద్ధాలపై అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ఎలాంటి ప్రభావం చూపుతాయి
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
శ్రేయాస్ అయ్యర్ ఏ జట్టు తరపున బరిలోకి దిగనున్నాడంటే?
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
పంట భలే ఏపుగా పెరిగింది అనుకునేరు.. లోపలకెళ్లి చూస్తే
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ
మన దేశంలో కులవ్యవస్థ బలంగా ఉంది: రాహుల్‌ గాంధీ