Summer Heat: మండిపోతున్న భానుడు.. ఎండల తాకిడికి జనం విలవిల.. మరింత పెరుగుతాయని హెచ్చరిక

మార్చి నెలాఖరు వచ్చేసరికి ఎండలు ముదిరిపోతున్నాయి. ఇకపై ప్రచండ భానుడి ఉగ్రరూపాన్ని చూడాల్సి వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓ వైపు కరోనా.. ఇంకోవైపు ప్రచండ సూర్యుని ఉగ్రరూపం వెరసి..

Summer Heat: మండిపోతున్న భానుడు.. ఎండల తాకిడికి జనం విలవిల.. మరింత పెరుగుతాయని హెచ్చరిక
Summer Heat
Follow us

|

Updated on: Mar 29, 2021 | 2:33 PM

Summer Heatwaves increasing across Telangana: మార్చి (March) నెలాఖరు వచ్చేసరికి ఎండలు ముదిరిపోతున్నాయి. ఇకపై ప్రచండ భానుడి (Sun) ఉగ్రరూపాన్ని చూడాల్సి వస్తుందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఓ వైపు కరోనా (Coronavirus).. ఇంకోవైపు ప్రచండ సూర్యుని ఉగ్రరూపం వెరసి.. జనానికి మిట్టమధ్యాహ్నం చుక్కలు కనిపించడం ఖాయమని తెలుస్తోంది. నిజానికి మార్చి రెండో వారంలో కొద్దిగా హెచ్చు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆ తర్వాత మూడో వారంలో కొద్దిగా చల్లబడిన పరిస్థితి కనిపించింది. అయితే.. చివరి వారానికి వచ్చే సరికి సూర్యుడు సుర్రుమనిపిస్తున్నాడు. సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచే ఎండ వేడిమి పెరిగిపోతోంది. మధ్యాహ్నం తర్వాత భానుడు భగ్గుమంటున్నాడు.

అధిక ఉష్ణోగ్రతలతో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు. ఆదివారం (మార్చి 28) తెలంగాణా (Telangana)లోని వివిధ ప్రాంతాలలో నమోదైన ఉష్ణాగ్రతలను పరిశీలిస్తే భానుడి తాకిడి ఎలా పెరిగిందో అర్థమవుతుంది. ఆదివారం నాడు మంచిర్యాల (Manchirial) జిల్లా నస్పూర్‌‌‌‌లో 42.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్‌‌‌ (Adilabad)‌ అర్బన్‌‌‌‌ భోరజ్‌‌‌‌, జునైద్‌‌‌‌లలో 42 డిగ్రీల ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ఈ సీజన్‌లో ఇప్పటిదాకా ఇవే అత్యధిక ఉష్ణోగ్రతలని చెబుతున్నారు. జిల్లాలవారీగా ఉష్ణోగ్రతలను పరిశీలస్తే.. మంచిర్యాలలో 40.2, కొమరం భీం ఆసిఫాబాద్‌ (Asifabad)లో 40, ఆదిలాబాద్‌‌‌‌లో 39.8, జగిత్యాల, జయశంకర్‌‌‌‌ భూపాలపల్లిలో 39.5, పెద్దపల్లి (Peddapalli), నిర్మల్ (Nirmal)‌‌‌‌లో 39.1, నిజామాబాద్‌ (Nizamabad)‌‌‌లో 39, వరంగల్ (Warangal)‌‌‌‌ అర్బన్‌‌‌‌, వనపర్తిలో 38.9, కరీంనగర్ (Karimnagar)‌‌‌‌, రాజన్న సిరిసిల్లలో 38.8, హైదరాబాద్ (Hyderabad)‌‌‌‌లో 37.6 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సోమవారం కొన్నిచోట్ల సాధారణం కంటే రెండు, మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని హైదరాబాద్‌‌‌‌ వాతావరణ శాఖ తెలిపింది.

ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శాస్త్రవేత్తలు అంఛనా వేస్తున్నారు. ఏ ఏడాదికి ఆ ఏడాది ఎండకాలంలో తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం, రామగుండం (Ramagundam), గోదావరిఖని ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ వేసవిలోనూ ఈ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. లాక్‌డౌన్ (Lock-down) కారణంగా గతేడాది వేసవికాలంలో ఎండల తాకిడి ఎక్కువగా అనిపించలేదు. ఎందుకంటే జనమంతా (దాదాపు 80 శాతం) ఇళ్ళకే పరిమితమయ్యారు. 2020లో లాక్‌డౌన్‌తోనే వేసవి కాలం గడిచిపోయింది. జనమంతా ఇళ్లలోనే ఉండటంతో వడదెబ్బ మరణాలు గణనీయంగా తగ్గాయి. కానీ ఈసారి 2021 సమ్మర్‌లో అందుకు భిన్నమైన పరిస్థితి కనిపించనున్నది. ఈఏడాది నెల రోజు ముందుగానే వేసవికాలం వచ్చిన సంకేతాలున్నాయి. దానికి ఫిబ్రవరి నుంచి నమోదవుతున్న ఉష్ణోగ్రతలే సాక్ష్యమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

గత కొన్ని దశాబ్ధాలుగా తెలంగాణలో అత్యధికంగా నమోదైన ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. 1973 మే 9వ తేదీన భద్రాచలం (Bhadrachalam)లో అత్యధికంగా 48.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తెలంగాణ రాష్ట్రంలో నమోదై అత్యధిక ఉష్ణోగ్రత ఇదే. 2003 మే 3వ తేదీన హన్మకొండ (Hanamkonda)లో 47.8 డిగ్రీలు, 2015 మే 22న ఖమ్మం (Khammam)లో 47.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 1984, మే 24వ తేదీన నిజామాబాదు, రామగుండంలలో అత్యధికంగా 47.3 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డయ్యింది. ప్రతీ సంవత్సరం మార్చి చివరి వారం, ఏప్రిల్‌, మే, జూన్‌ మొదటి వారంలో ఎక్కువగా వడగాలులు వీస్తున్నాయి. వాస్తవ గరిష్ట ఉష్ణోగ్రత 45 డిగ్రీలుగానీ.. అంతకంటే ఎక్కువగా వున్నప్పుడు వడగాలులు వీస్తాయి. 47 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలుంటే వడగాల్పుల తీవ్రత మరింత ఎక్కువగా వుంటుంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రతలను మించి ఐదు నుంచి 6 డిగ్రీలు ఎక్కువ ఉంటే వడగాల్పులు వీచే అవకాశం ఎక్కువగా వుంటుంది.

గరిష్ట ఉష్ణోగ్రత సాధారణ ఉష్ణోగ్రతల కన్నా ఏడు డిగ్రీల కంటే ఎక్కువ నమోదైతే ఆ రోజును తీవ్ర వడగాల్పుల రోజుగా పేర్కొంటారు. 2010 సంవత్సరంలో అత్యధికంగా 46 రోజుల పాటు వడగాలులు వీచినట్టు వాతావారణ శాఖ రికార్డుల్లో నమోదైంది. 2019లోనూ 44 రోజుల పాటు వడగాల్పులు వీచినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2016లో అతి ఎక్కువ వడగాలులు నమోదయ్యాయి. అతి తక్కువగా 2008లో ఒక్కరోజే వడగాలువు వీచినట్లు రికార్డుల్లో పేర్కొన్నారు. 2015లో వడగాల్పుల ప్రభావానికి గురై అత్యధికంగా 541 మంది మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2013లో 516 మంది, 2016లో 340 మందికిపైగా చనిపోయినట్లు గణాంకాలున్నాయి. 2018 నుంచి వడగాలుల వల్ల చనిపోయిన వారి సంఖ్యను ప్రభుత్వాలు తెలియజేయడం లేదు.

కొన్ని దశాబ్దాలుగా పట్టణీకరణ, పారిశ్రామికీకరణ కారణంగా పెరిగిపోతున్న కాలుష్యమే వేసవిలో ఎండల తాకిడి పెరగడానికి దారితీస్తోందని పర్యావరణ వేత్తలు అంటున్నారు. వేసవి వేడి పెరగడానికి కారణమితేనని చెబుతున్నారు. ఈ కారణంగానే భూతాపం పెరిగిపోతోందని అంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 1900వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. సాధారణం కంటే 0.9 డిగ్రీల నుంచి ఒక డిగ్రీ సెల్సియస్ మేర పెరిగినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం భూతాపం పెరిగిపోతోంది. యూఎస్ నేషనల్ ఓషియానిక్ అండ్ స్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ అధ్యయనం ప్రకారం పదేళ్లకు సగటున పెరుగుతున్న ఉష్ణోగ్రత 0.17 డిగ్రీల సెల్సియస్. నాసా లెక్కల ప్రకారం 1951 నుంచి 1980 మధ్య నమోదైన సగటు ఉష్ణోగ్రతలతో పోలిస్తే.. 2017లో నమోదైన సగటు ఉష్ణోగ్రత 0.9 డిగ్రీల సెల్సియస్‌గా వుంది.

2019 మార్చి 30 నాటికి ఎండలు తీవ్రమయ్యాయి. మహబూబాబాద్ జిల్లా గార్లలో 42.7 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదైంది. ఖమ్మంలో సాధారణం కన్నా 3.9 డిగ్రీలు పెరిగి 40.2 డిగ్రీలు నమోదైంది. మెదక్‌లో 3.5 డిగ్రీలు పెరిగి 41.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. హైదరాబాద్‌లో 3.3 డిగ్రీలు పెరిగి 40.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. నిజామాబాద్‌లో 3 డిగ్రీలు పెరిగి 41.5 డిగ్రీల సెల్సియస్, భద్రాచలంలో 2.9 డిగ్రీలు పెరిగి 41.2 డిగ్రీల సెల్సియస్, మహబూబ్ నగర్‌లో 2.8 డిగ్రీలు పెరిగి 41 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

2020లో ఫిబ్రవరిలోనే ఎండల తాకిడి పెరిగింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో 36 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. మహబూబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 36.3 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రత నమోదు కాగా.. మిగతా ప్రాంతాల్లో 33 నుంచి 34 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. మరోవైపు కనిష్ఠ ఉష్ణోగ్రతలు కూడా పతనమవుతున్నాయి. చలికాలంలో కొమరంభీం అసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా గిన్నెదారి, ఆసిఫాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లలో 8.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతల నమోదయ్యాయి. అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగాను వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయి. కృష్ణా జిల్లా నందిగామలో 39 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. అనంతపురంలో 38.6 డిగ్రీల సెల్సియస్, కర్నూలులో 37.8 డిగ్రీల సెల్సియస్ రికార్డు కాగా.. మరి కొన్ని ప్రదేశాల్లో మధ్యాహ్నం 39 డిగ్రీల సెల్సియస్ నమోదవుతోంది. రాత్రుళ్లు 17 డిగ్రీల సెల్సియస్ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.

ఇక దేశ్యవాప్తంగా నమోదవుతున్న వేసవి ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే.. 2020వ సంవత్సరం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన సంవత్సరంగా తేలింది. అనేక చోట్ల పగటి ఉష్ణోగ్రతలు గరిష్టంగా సగటుకంటే 0.29 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి. భారత వాతావరణ శాఖ వివరాల ప్రకారం… 1901 నుంచి చూస్తే.. అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైన ఎనిమిది సంవత్సరాలలో 2020 సంవత్సరం ఒకటిగా నిలిచింది. సగటు ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదైన సంవత్సరాలను ఓసారి పరిశీలిస్తే.. 2006-2020 మధ్య 12 సంవత్సరాలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 2001-2010 దశాబ్దంలో 0.23 ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. 2011-2020 దశాబ్దంలో 0.34 డిగ్రీలు ఎక్కువ ఉష్ణోగ్రత నమోదైంది. ఈ రెండు దశాబ్దాలు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ చరిత్రలో నిలిస్తున్నాయి. 2009లో 0.55 డిగ్రీల కంటే ఎక్కువ నమోదు కాగా.. 2010లో 0.53 డిగ్రీల కంటే ఎక్కువ నమోదైంది. 2015లో 0.42 డిగ్రీల కంటే ఎక్కువ నమోదు కాగా.. 2016లో.. 0.71 డిగ్రీల ఎక్కువగాను, 2017లో 0.54 డిగ్రీల కంటే ఎక్కువ నమోదయ్యాయి.

ప్రస్తుతం భారత్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రత 24 డిగ్రీల సెల్సియస్ కాగా.. ఇది 2100 నాటికి సగటు ఉష్ణోగ్రతలు 28 డిగ్రీల సెల్సియస్‌కు చేరే పరిస్థితి కనిపిస్తోంది. కొన్ని ప్రాంతాల్లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలు పెరిగి 32 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశాలున్నాయి. 2019 సెప్టెంబర్‌లో గ్లోబల్ కార్బన్ డయాక్సైడ్ స్థాయి 408.55 పార్ట్స్ పర్ మిలియన్‌గా (పీపీఎం) నమోదు కాగా.. ఇది 2040 నాటికి 540 పీపీఎంకు చేరే ప్రమాదం కనిపిస్తోంది. 2100 నాటికి పీపీఎం గణనీయంగా పెరిగి.. 940కు చేరుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. 2100 కల్లా ఆంధ్రప్రదేశ్‌లో సగటు వార్షిక ఉష్ణోగ్రతలు 4 శాతం పెరిగే అవకాశం వుంది. సముద్ర తీరం వెంట మట్టి క్షయం.. భారీగా తీరం కోత ముప్పు పొంచి వుంది. తీర ప్రాంతాలు తీవ్రమైన తుఫాన్ల బారినపడే అవకాశాలున్నట్లు హెచ్చరికలు జారీ అవుతున్నాయి.

ALSO READ: కరోనా ఆసుపత్రుల్లో అగ్ని ప్రమాదాలు.. కారణాలను విశ్లేషిస్తే షాకే..!

Latest Articles
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
ఇక ఐదు రోజులే పనిదినాలు.. బ్యాంకు ఉద్యోగులకు బంపర్ ఆఫర్..
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొత్తిమీర టీ తాగండి.. ఎందుకంటే?!
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
అమావాస్య రోజున ఈ పనులు చేయవద్దు.. లేకపోతే ఆర్ధిక ఇబ్బందులు తప్పవు
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
సిటీ వద్దు.. శివారే ముద్దు.. జనాల్లో మార్పునకు కారణమిదేనా..
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
హైదరాబాద్‌ను ముంచెత్తిన వర్షం.. విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
మీ ఫోన్లో ఈ రెండు యాప్స్ ఉంటే వెంటనే డిలీట్ చేసేయండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
Horoscope Today: ఆ రాశి వారు సహోద్యోగులతో జాగ్రత్తగా మెలగండి..
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
ప్రధాని మోడీని కలిసిన పీవీ నరసింహరావు కుటుంబ సభ్యులు.. కారణమిదే
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
సంజూ శాంసన్ పోరాటం వృథా.. రాజస్థాన్‌పై ఢిల్లీ విజయం
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.
ప్రేమలో ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు.? షాహిద్ కపూర్ వీడియో.