AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నాన్నా.. త్వరగా రండి.. నన్ను బయటకు తీయండి.. బస్సు చక్రాల కింద నలిగి.. చికిత్స పొందుతూ మృతి

ఉన్నతమైన చదువులు చదివి అనుకున్నది సాధించాలని అనుకున్న ఆమెకు నిండు నూరేళ్లు నిండియి. బీఈడీ చదివి ఏదో ఉద్యోగం సాధించి కుటుంబానికి అసరాగా ఉందామనుకున్న ఆ యువతికి...

నాన్నా.. త్వరగా రండి.. నన్ను బయటకు తీయండి.. బస్సు చక్రాల కింద నలిగి.. చికిత్స పొందుతూ మృతి
Subhash Goud
|

Updated on: Mar 28, 2021 | 8:11 PM

Share

ఉన్నతమైన చదువులు చదివి అనుకున్నది సాధించాలని అనుకున్న ఆమెకు నిండు నూరేళ్లు నిండియి. బీఈడీ చదివి ఏదో ఉద్యోగం సాధించి కుటుంబానికి అసరాగా ఉందామనుకున్న ఆ యువతికి ఆశలు అడియాశలయ్యాయి. ఓ ట్రావెల్‌ బస్సు డ్రైవర్‌ నిర్లక్ష్యం కారణంగా ఓ నిండు ప్రాణం గాల్లో కలిసిపోయింది. తండ్రితో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న యువతిని వేగంగా బస్సు ఢీకొట్టడమే కాకుండా యువతిని కొంద దూరం ఈడ్చుకెళ్లడం విషాదంగా మారింది.

వైజాక్‌ జంక్షన్‌ సమీపంలో కాకానీ నగర్‌ వంతెన వద్ద శనివారం ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. తండ్రితో ద్విచక్ర వాహనంపై గాజువాక నుంచి ఎంవీపీ కాలనీలోని కళాశాలకు వెళ్తున్న సమయంలో కావేరీ ట్రవెల్స్‌కు చెందిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న గీత అనే యువతి బస్సు వెనక చక్రాల కింద పడిపోయింది. దీంతో డ్రైవర్‌ గుర్తించకపోవడంతో కొంత దూరం అలానే గీతను ఈడ్చుకెళ్లాడు. దీంతో గీతను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా, ఆదివారం చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గాజువాక భవానీ నగర్‌ ప్రాంతానికి చెందిన సమ్మిడి వెంకట్రావు తనకుమార్తె గీత కుమారి (21) బీఈడీ చదువుతోంది. ఎంవీపీ కాలనీలోని కళాశాలకు ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా కాకానీనగర్‌ వంతెన ఎక్కే సమయంలో వెనుక నుంచి వచ్చిన కావేరీ ట్రవెల్స్‌ బస్సు ఢీకొట్టింది. వెంకట్రావు రోడ్డు పక్క వైపు పడగా, గీతాకుమారి బస్సు వెనక చక్రాల కింద పడిపోయింది.

గీతను కొంత దూరం ఈడ్చుకెళ్లిన బస్సు

కాగా, బస్సు ఢీకొట్టగానే వెనుక చక్రాల కింద పడిపోయిన గీతను దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఈడ్చు కెళ్లడంతో నడుము భాగం తీవ్రంగా దెబ్బతింది. ఆ సమయంలో తనకు ఏం జరిగిందో గీతాకుమారికి తెలియపరిస్థితి ఎదురైంది. ‘నాన్న రండి.. నన్ను బయటకు తీయండి నాన్న.. అంటూ విలపించింది. సమాచారం తెలుసుకున్న ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ఆమెను నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు ఆమెను కేజీహెచ్‌కు తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. మృతురాలి తండ్రి వెంకట్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధిత కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదుతో ఎయిర్‌పోర్టు జోన్‌ పోలీసుస్టేషన్‌లో కేసు నమోదైనట్లు ఎస్సై ఉమామహేశ్వరరావు తెలిపారు. కాగా, యువతి బస్సు చక్రాల కిందపడగానే నాన్న త్వరగా రండి…అంటూ విలపించడం అందరిని కలచివేస్తోంది. కాగా, ఈ ప్రమాదం జరుగగానే స్థానికులు ఎన్ఎడి జంక్షన్ వద్ద నిరసన తెలిపారు. ఈ ప్రమాదానికి కారణమై ట్రావెల్‌ బస్సు డ్రైవర్‌, యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడున్నారు.

జంక్షన్‌ వద్ద కుటుంబ సభ్యులు, బంధువు నిరసన

ప్రమాదంపై మృతురాలి కుటుంబ సభ్యులు, బంధువులు జంక్షన్‌ వద్ద నిరసనకు దిగారు. తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్‌ చేశారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులకు, బంధువులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే తమకు న్యాయం జరిగే వరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని వారు తేల్చి చెప్పారు.

కాగా, కొందరు డ్రైవర్ల నిర్లక్ష్యం కారణంగా ఇలాంటి అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా..ఇలాంటి డ్రైవర్ల కారణంగా అమాయకులు బలవుతున్నారు. మద్యం తాగి వాహనాలు నడపడం, అతివేగం, నిర్లక్ష్యం తదితర కారణాల వల్ల ఇలాంటి ప్రమాదాలు ప్రతి రోజు జరుగుతూనే ఉన్నాయి. ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వ్యక్తి తిరిగి వస్తాడా…?లేడా..? అన్న నమ్మకం లేకుండా పోతోంది ఈ రోజుల్లో.

వైల్డ్ డాగ్ ఈవెంట్ లైవ్ దిగువన చూడండి….

ఇవీ చదవండి: Criminal Encounter: తప్పించుకున్న 72 గంటల్లోనే పోలీసుల చేతుల్లో ఎన్‌కౌంటర్‌ అయిన కరుడుగట్టిన నేరగాడు

AP Crime News: మహిళల పొదుపు నిధులను మింగేశారు.. ఏకంగా కోటి 75లక్షలు కాజేశారు…!