AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bride Arrest: పెళ్లి కొడుకు నచ్చాడంటుంది.. పెళ్లికి కూడా సిద్ధమవుతుంది.. కానీ.. అసలు కథ అప్పుడే స్టార్ట్..

Bride Arrest: పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదుగురు వరులకు కుచ్చుటోపి పెట్టింది ఓ వధువు. చివరికి విషయాన్ని గ్రహించిన బాధితులు..

Bride Arrest: పెళ్లి కొడుకు నచ్చాడంటుంది.. పెళ్లికి కూడా సిద్ధమవుతుంది.. కానీ.. అసలు కథ అప్పుడే స్టార్ట్..
UK Marriage Age
Shiva Prajapati
|

Updated on: Mar 29, 2021 | 12:48 PM

Share

Bride Arrest: పెళ్లి చేసుకుంటానని చెప్పి ఐదుగురు వరులకు కుచ్చుటోపి పెట్టింది ఓ వధువు. చివరికి విషయాన్ని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంలో ఊహించని విషయాలు వెలుగు చూశాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్‌ జిల్లాలో వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మధ్యప్రదేశ్‌లోని హర్దా జిల్లాకు చెందిన వరుడు, భోపాల్ జిల్లాకు చెందిన ఓ వధువుతో పెళ్లికి సిద్ధమయ్యాడు. పెళ్లి ముహూర్తం రోజున కుటంబ సభ్యులు, బంధు మిత్రులతో కలిసి వివాహ వేదిక వద్దకు(వధువు ఇంటివద్దకు) చేరుకున్నాడు. అయితే, అప్పుడే అతనికి పెద్ద ట్విస్ట్ ఎదురైంది. వివాహ వేదికకు తాళం వేసి ఉంది. అది చూసి షాక్ అయిన వరుడు.. వధువుకు ఫోన్ చేశాడు. స్వచాఫ్ వచ్చింది. దాంతో అతను వధువు తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు. వారి ఫోన్లు కూడా స్విచాఫ్ వచ్చాయి. జరిగిన మోసాన్ని గ్రహించిన వరుడు.. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

తాను మోసపోయిన విధానాన్ని పోలీసులకు వివరించాడు. ఇప్పుడు షాక్ అవడం పోలీసుల వంతైంది. ఎందుకంటే.. ఈ వరుడి మాదిరిగా మరికొంతమంది యువకులు కూడా పెళ్లి పేరుతో తమను వంచించారంటూ ఫిర్యాదు చేశారు. దాంతో ఈ కేసును సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ఫోన్ నెంబర్ల ఆధారంగా నిందితులను ట్రేస్ చేసి పట్టుకున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా కీలక విషయాలు వెల్లడించారు. పెళ్లి పేరుతో ఈ ముఠా వరుడి కుటుంబ నుంచి భారీగా డబ్బులు తీసుకుని, తీరా పెళ్లి సమయానికి పరారయ్యేవారు. ఇలా యువతి.. ఐదుగురు యువకులను మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. కాగా, ఈ వ్యవహారంలో వధువుతో పాటు.. మరో ఇద్దరు వ్యక్తుల ప్రమేయం ఉన్నట్లు గుర్తించిన పోలీసులు.. వారిని కూడా అదుపులోకి తీసుకున్నారు. వారిపై సెక్షన్ 420 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also read:

Holi 2021:కరోనా నిబంధనలను పాటిస్తూ.. సేఫ్ గా రంగుల పండుగను జరుపుకుంటున్న హీరోయిన్లు జెనీలియా, రష్మిక, రకుల్

Vodafone Idea: వోడాఫోన్‌ ఐడియా (Vi) యూజర్లకు అదిరిపోయే‌ ఆఫర్.. ఈ రీఛార్జ్‌లు చేసుకుంటే రూ.60 వరకు క్యాష్‌బ్యాక్‌