Fake Accounts In Facebook: ‘అర్జెంట్‌గా డబ్బులు పంపించు’ అంటూ మీకు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ వస్తుందా.? అయితే ఇది తెలుసుకోండి..

Fake Accounts In Facebook: సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. పోలీసులు, ప్రజలు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా కొత్త దారి వెతుక్కుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో ఉండి నెటిజన్ల బ్యాంక్‌ ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు..

Fake Accounts In Facebook: 'అర్జెంట్‌గా డబ్బులు పంపించు' అంటూ మీకు ఫేస్‌బుక్‌లో మెసేజ్‌ వస్తుందా.? అయితే ఇది తెలుసుకోండి..
Fake Facebook Accounts
Follow us
Narender Vaitla

|

Updated on: Mar 29, 2021 | 8:27 PM

Fake Accounts In Facebook: సైబర్‌ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. పోలీసులు, ప్రజలు ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నా కొత్త దారి వెతుక్కుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. ఎక్కడో ఉండి నెటిజన్ల బ్యాంక్‌ ఖాతాల్లోని డబ్బును కాజేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా కొందరు కేటుగాళ్లు ఫేస్‌బుక్‌ను తమ నేరానికి వారథిగా వాడుకుంటున్నారు. వివరాల్లోకి వెళితే.. మీకు ఫేస్‌బుక్‌లో అప్పటికే స్నేహితుడిగా (ఫ్రెండ్‌)గా ఉన్న వ్యక్తి ఐడీని పోలిన ఓ యాడ్‌ రిక్వెస్ట్‌ వస్తుంది. ‘పొరపాటున పాత ఐడీ డిలీట్‌ అయ్యిందేమో అందుకే మళ్లీ రిక్వెస్ట్‌ పంపించాడమో’ అని యాక్సెప్ట్‌ చేస్తారు. అందులోనూ మీ ఫ్రెండ్‌ ఫొటోనే డీపీగా పెట్టడం, ప్రొఫైల్‌ కూడా అతడిదే పోలి ఉండడంతో వెనకా ముందు చూసుకోకుండా ఓకే చేస్తారు. ఇక అసలు కథ అప్పుడే మొదలతుంది. ఒకానొక సమయంలో ‘హాయ్‌.. నేను పలానా హాస్పిటల్‌లో ఉన్నాను. మా సోదరుడికి యాక్సిడెంట్‌ జరిగింది. వెంటనే రూ. పది వేలు అవసరం ఉన్నాయి. గూగుల్ పే చేయావా?’ అంటూ ఓ ఫోన్‌ నెంబర్‌ను పంపిస్తారు. తెలిసిన వ్యక్తేగా.. డబ్బులు ఎంత అవసరం ఉంటే అడుగుతాడు అని భావించి వెంటనే డబ్బులు పంపిచేస్తారు. తీరా కాసేపటికే ఆ అకౌంట్‌ డిలీట్‌ అయిపోతుంది. మీరు డబ్బులు పంపించారని భావిస్తోన్న వ్యక్తికి ఫోన్‌ చేసి అడిగితే.. ‘నేను డబ్బులు అడగడం ఏంటి.?’ అనే సమాధానం వస్తుంది. అప్పుడు కానీ తెలియదు మీరు మోసపోయారని, ఎవరికో తెలియని వ్యక్తికి ఆ రూ. పది వేలు పంపించారని. ప్రస్తుతం ఇలాంటి మోసాలు బాగా జరుగుతున్నాయి. చాలా మంది మోసపూరిత మెసేజ్‌లకు రిప్లై ఇస్తూ డబ్బులు కోల్పోతున్నారు. వరుసగా జరుగుతోన్న ఇలాంటి సంఘటనలపై పోలీసులు నెటిజన్లను అలర్ట్‌ చేసే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా ఏదైనా ఫ్రెండ్‌ రిక్వెస్ట్‌ వస్తే వెంటనే ఓకే చేయకుండా ఆలోచించాలని సూచిస్తున్నారు. అలాగే ఎవరైనా డబ్బులు అడిగితే.. ముందుగా వారి ఒరిజినల్‌ ఫోన్‌ నెంబర్‌కు ఫోన్‌ చేసి కన్ఫామ్‌ చేసుకున్న తర్వాతే డబ్బులు పంపించడం లాంటివి చేయాలని అవగాహన కల్పిస్తున్నారు.

Also Read: Veeravaram Murder : చికెన్ పకోడి వివాదం.. బాలుడి ప్రాణానికొచ్చింది.. మద్యం మత్తులో పదో తరగతి విద్యార్థి హత్య..

Treasure hunt: మాంత్రికుడి మాటలు విని.. గుప్త నిధుల కోసం 50 అడుగుల గొయ్యి… అదే వారి ప్రాణాలు తీసింది

బాజా భజంత్రీలతో పెళ్లి మండపానికి చేరుకున్న ఐదుగురు పెళ్లి కొడుకులు.. తాళం వేసి జంప్ అయిన వధువు..!

రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
రోగాల బెండు తీసే కూరగాయ.. ఆ జిగురుతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు..
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
అమ్మా.. నీ అవసరం తీరిపోయింది నిన్నొదిలేస్తున్నా.! వృద్ధాశ్రమం బయట
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
30 దాటాకా పెళ్లయినా.. పెద్దగా లాభం లేదట.! ఆలోచించుకోండి మరి..
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
ఒకటి.. రెండు కాదు.. ఒకేసారి వికసించిన 26 బ్రహ్మ కమలాలు.! వీడియో
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
బంగారం ధర.. ఇవాళ ఎంతుందంటే.! తగ్గినట్టే తగ్గి మళ్లీ పరుగు..
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
ఇలాంటి కష్టకాలంలో వాళ్లకు రెహమాన్‌ లీగల్ నోటీసులు.! వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
కాబోయే భార్యను ఉద్దేశించి నాగచైతన్య ఆసక్తికర వ్యాఖ్యలు.. వీడియో.
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
విజయ్‌-రష్మిక మళ్లీ దొరికేశారుగా.! లంచ్ చేస్తున్న ఫోటో వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
నా మాజీ కోసం చాలా ఖర్చు చేశాను.! సమంత కామెంట్స్ వైరల్‌..
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!