Pakistan Terrorist Attack: పాకిస్తాన్‌లో భారీ ఉగ్రదాడి.. 10 మంది సైనికులు మృతి..!
Pakistan Terrorist Attack: పాకిస్థాన్ (Pakistan)లోని బలూచిస్థాన్ ((Balochistan) ప్రావిన్స్ (Province) లో భారీ ఉగ్రదాడి (Terror Attack) జరిగింది ..
Pakistan Terrorist Attack: పాకిస్థాన్ (Pakistan)లోని బలూచిస్థాన్ ((Balochistan) ప్రావిన్స్ (Province) లో భారీ ఉగ్రదాడి (Terror Attack) జరిగింది . ఈ ఉగ్రదాడి (Terrorist Attack)లో 10 మంది జవాన్లు మరణించినట్లు వార్తలు వచ్చాయి. బలూచిస్థాన్‌లోని కెచ్ జిల్లాలో భద్రతా చెక్‌పోస్టుపై ఉగ్రవాదులు గురువారం కాల్పులు జరిపారని ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ (ఐఎస్‌పిఆర్) డైరెక్టర్ జనరల్ (ISPR) మేజర్ జనరల్ బాబర్ ఇఫ్తికర్ తెలిపారు. ఈ దాడిలో 10 మంది జవాన్లు మరణించారు. ఈ ఘటన జనవరి 25 నుంచి 26 మధ్య రాత్రి జరిగిందని, ఇందులో ఒక ఉగ్రవాది మరణించగా, పలువురు గాయపడ్డారని ఆర్మీ మీడియా విభాగం ఒక ప్రకటనలో తెలిపింది.
ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు (Security Forces) పట్టుకున్నాయి, ఘటనలో పాల్గొన్న ఇతర ఉగ్రవాదుల కోసం వారు ఇంకా వెతుకుతున్నారు. ఆఫ్ఘనిస్తాన్ (Afghanistan)లో అధికారాన్ని ఆక్రమించిన తాలిబన్లు పాకిస్థాన్‌కు చెడ్డపేరు తీసుకువస్తున్నారు. నవంబర్ 10 నుంచి డిసెంబరు 10 వరకు ఒక నెలపాటు కాల్పుల విరమణ చేసినప్పటికీ ఉగ్రవాద దాడుల సంఖ్య తగ్గలేదని పాకిస్థాన్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ కాన్‌ఫ్లిక్ట్ అండ్ సెక్యూరిటీ స్టడీ (పీఐసీఎస్ఎస్) నివేదిక పేర్కొంది. పాకిస్తాన్‌లో ప్రతి నెలా సగటు ఉగ్రవాద దాడుల సంఖ్య 2020లో 16 నుండి 2021లో 25కి పెరిగింది. ఇది 2017 తర్వాత అత్యధికం.
103 దాడుల్లో 170 మంది చనిపోయారు:
నివేదికల ప్రకారం.. 103 దాడుల కారణంగా 170 మంది మరణించారు. బలూచిస్తాన్‌లో అత్యధిక సంఖ్యలో గాయపడ్డారు. దాడుల్లో గాయపడిన వారిలో 50 శాతానికి పైగా ఈ ప్రావిన్స్‌లో దాడులకు గురైనవారే. బలూచిస్థాన్ తర్వాత అత్యధికంగా ప్రభావితమైన ప్రాంతం ఖైబర్ పఖ్తుంఖ్వా అని నివేదిక పేర్కొంది. ఆఫ్ఘనిస్థాన్‌లో పాకిస్థాన్ జోక్యంపై నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాకిస్తాన్ తాలిబాన్‌కు బహిరంగంగా మద్దతు ఇస్తోందని, ఇది ప్రాంతీయ సంఘర్షణను మాత్రమే పెంచుతుందని వారు బలంగా నమ్ముతున్నారు.
ఈ పరిస్థితి వెనుక నేతల వ్యక్తిగత ప్రయోజనాలే కారణం. దీంతో పాక్ చర్యలు మరుగున పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇది ప్రత్యేకంగా దాని సైనిక, గూఢచార స్థాపనపై ప్రభావం చూపుతుంది. అయితే ఎన్ని దాడులు జరిగినా, తాలిబన్ల పట్ల పాకిస్థాన్ ప్రభుత్వం మెతక వైఖరి వ్యవహరిస్తోంది. ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ స్వయంగా అనేక సందర్భాల్లో తాలిబాన్ ప్రతినిధిలా మాట్లాడటం కనిపిస్తుంది.
ఇవి కూడా చదవండి: