Omicron Variant: ఒమిక్రాన్ చర్మం, ప్లాస్టిక్‌పై ఎన్ని గంటలు జీవించి ఉంటుందో తెలుసా..? అధ్యయనంలో షాకింగ్ విషయాలు
Omicron Variant: కరోనా మహమ్మారి వ్యాప్త చెంది దాదాపు రెండేళ్లు దాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకువచ్చి..
Omicron Variant: కరోనా మహమ్మారి వ్యాప్త చెంది దాదాపు రెండేళ్లు దాటేసింది. ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. కొత్త కొత్త వేరియంట్లతో పుట్టుకువచ్చి ప్రజలను వణికిస్తోంది. డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు విరుచుకుపడుతున్నాయి. అయితే గతంలో వచ్చిన వేరియంట్ల కంటే ఒమిక్రాన్ ప్రభావం తక్కువగా ఉన్నా.. మనుషుల్లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. కొత్త వేరియంట్‌పై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ వైరస్ ఎన్నిగంటల పాటు గాలిలో జీవించి ఉంటుందనేదానిపై జపాన్‌కు చెందిన పరిశోధకులు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ అధ్యయనంలో కీలక అంశాలు వెలుగు చూశాయి.
మనిషి శరీరంపై 21 గంటలు:
ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 21 గంటల పాటు సజీవంగా ఉంటుందని, అదే ప్లాస్టిక్‌పై దాదాపు 8 గంటల పాటు సజీవంగా ఉంటుందన క్యోటో ప్రీఫెక్చురల్ యూనివర్సిటీ ఆఫ్ మెడిసిన్ పరిశోధకుల బృందం గుర్తించింది. ఈ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందడానికి కారణం కూడా ఇదేననని తెలిపింది.
మనిషి శరీరలో కాకుండా బయట పరిసరాల్లో కోవిడ్19, ఇతర కొత్త వేరియంట్లు ఎంత కాలం జీవించి ఉంటాయనే అంశాన్ని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ అధ్యయనం ఇటీవల bioRxivలో ప్రచురితమైంది. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఒరిజినల్ స్ట్రెయిన్ (కొవిడ్ 19)తో పోలిస్తే రెండు రెట్లు కన్నా అధికంగా చర్మం, ప్లాస్టిక్‌పై జీవించే ఉండే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఇతర వేరియంట్లతో పోల్చినట్లయితే ఒమిక్రాన్ అత్యధిక పర్యావరణ స్థిరత్వాన్ని కలిగి ఉందని, అందుకే డెల్టా వేరియంట్‌తో పోల్చితే ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తెలిపారు.
చర్మం, ప్లాస్టిక్‌పై ఏ వేరియంట్ ఎన్ని గంటలు..?
పరిశోధకుల అధ్యయనం ప్రకారం.. ఒమిక్రాన్ వేరియంట్ ప్లాస్టిక్ ఉపరితలంపై 193.5 గంటలు అంటే దాదాపు 8 రోజుల పాటు జీవించ ఉండగలదని గుర్తించారు. ఇక స్ట్రెయిన్ 56 గంటలు, ఆల్ఫా 191.3 గంటలు, బీటా వేరియంట్ 156.6 గంటలు, డెల్టా వేరియంట్ 114 గంటల పాటు ప్లాస్టిక్‌పై జీవించి ఉంటుందని గుర్తించారు. ఇక చర్మంపై ఒమిక్రాన్ 21 గంటలు, స్ట్రెయిన్ 8.6 గంటలు, ఆల్ఫా 19.6 గంటలు, డెల్టా వేరియంట్ 16.8గంటలు జీవించి ఉంటుందని బృందం వెల్లడించింది.
శానిటైజర్ తప్పనిసరి
ముప్పు తిప్పలు పెడుతున్న కొత్త వేరియంట్లను తరిమికొట్టాలంటే శానిటైజర్‌తో చేతులను శుభ్రం చేసుకోవడం తప్పనిసరి అని సూచిస్తున్నారు. శానిటైజర్‌తో శుభ్రం చేసుకుంటే 15 సెకన్లలో వైరల్ నాశనం అవుతుందని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరు చేతులకు శానిటైజర్ వాడాలని, ముఖానికి మాస్క్ తప్పనిసరి అని అన్నారు.
ఇవి కూడా చదవండి: