Taliban Vs Pakistan: పాక్ మిత్ర దోహంపై తాలిబన్లు సీరియస్.. ఇస్లామాబాద్ పెద్దలకు గట్టి వార్నింగ్
Taliban warn Pakistan: వ్యక్తుల మధ్యనే కాదు.. దేశాల మధ్య కూడా స్నేహం శత్రుత్వం పరిస్థితులు అవసరాల బట్టి ఏర్పడతాయి. నిన్న మొన్నటి వరకూ స్నేహితులుగా ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య..
Taliban Vs Pakistan: వ్యక్తుల మధ్యనే కాదు.. దేశాల మధ్య కూడా స్నేహం శత్రుత్వం పరిస్థితులు అవసరాల బట్టి ఏర్పడతాయి. నిన్న మొన్నటి వరకూ స్నేహితులుగా ఉన్న పాకిస్తాన్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య ఇప్పుడు శత్రుత్వం ఏర్పడింది. ఆఫ్ఘనిస్తాన్ , పాకిస్తాన్ దేశాల మధ్య 2640 కిలోమీటర్ల సరిహద్దు ప్రాంతం డ్యురాండ్ రేఖ విషయంలో ఇప్పుడు ఇరుదేశాల మధ్య వివాదం నెలకొంది. తాము డ్యురాండ్ రేఖలో ఫెన్సింగ్‌ను నిర్మించే అనుమతిని పాకిస్తాన్ కి ఇవ్వబోమని ఆఫ్ఘనిస్తాన్ లోని తాజా ప్రభుత్వం తాలిబాన్ తేల్చి చెప్పింది. సరిహద్దు ఫెన్సింగ్ అంశంపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఆఫ్ఘనిస్థాన్… పాకిస్థాన్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చింది.
పాకిస్థాన్‌కు సరిహద్దు దేశం ఆఫ్ఘనిస్థాన్‌లో తాలిబన్ ప్రభుత్వం ఉంది. ఆఫ్ఘనిస్తాన్‌లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి.. ఆ దేశం స్వాధీనం చేసుకునేందుకు తాలిబాన్లకు పాకిస్థాన్ సాయపడింది. అయితే ఇప్పుడు వీరిద్దరి స్నేహం.. శత్రుత్వం దిశగా సాగుతోంది.
తాలిబన్ కమాండర్ బుధవారం ఆఫ్ఘనిస్తాన్ లోని మీడియా తో మాట్లాడుతూ.. తాము ఎప్పటికీ.. డ్యురాండ్ రేఖ వద్ద ఏ విధమైన ఫెన్సింగ్‌ను అనుమతించమని చెప్పారు. ఇంతకు ముందు పాకిస్థాన్ ఏం చేశారో అది అనవసరం.. కానీ ఇక నుంచి అక్కడ పాకిస్థాన్ ఏ నిర్మాణం చేపట్టడానికి అనుమతినివ్వమని చెప్పారు. అయితే నెక్స్ట్ వీక్ మొదట్లో తాలిబాన్‌తో పాకిస్థాన్ ల మధ్య ఉన్న విబేధాలను దౌత్య మార్గాల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకుంటామని ప్రకటించిన కొన్ని గంటల్లోనే తాలిబన్ కమాండర్ ఈ విధమైన ప్రకటన చేయడం విశేషం.
ఇదే విషయంపై ఇస్లామాబాద్‌లో విలేకరులతో ఖురేషి మాట్లాడుతూ… ఎటువంటి కారణం లేకుండా ఈ సమస్యను లేవనెత్తుతున్నాయి.. మేము ఈ విషయాన్నీ పరిశీలిస్తున్నామని చెప్పారు. అంతేకాదు తాము ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వంతో టచ్‌లో ఉన్నామని .. దౌత్యపరంగా ఈ సమస్యను పరిష్కరించుకుంటామని ఆశిస్తున్నట్లు చెప్పారు.
90 శాతం ఫెన్సింగ్ పనులు పూర్తి: పాకిస్తాన్ ఈ సరిహద్దు రేఖలో 90 శాతం ఫెన్సింగ్ పనిని పూర్తి చేసింది. అయితే తాలిబన్లు ఆప్ఘనిస్తాన్ లో మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత పాకిస్థాన్ తమకు లాభం చేకూరుతుందని భావించింది. అయితే అందుకు విరుద్దంగా పాకిస్థాన్ లో ఎన్నడూ లేని విధంగా రికార్డ్ స్థాయిలో ఉగ్రవాదుల దాడులు జరిగాయి.
Also Read: నేటి తరం గుర్తించేలా కాకినాడ గొట్టం కాజాకు పోస్టల్ శాఖ అరుదైన గుర్తింపు..