‘లాహోర్ లో పేలుడు ఘటనకు ఇండియాదే బాధ్యత’ ..పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆక్రోశం
లాహోర్ లోని జోహార్ లో గత నెల 23 న జమాత్ ఉద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి వద్ద జరిగిన పేలుడు ఘటనకు ఇండియాయే కారణమని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆరోపించారు. ఆ పేలుడులో నలుగురు మరణించగా సుమారు డజను మంది గాయపడ్డారు. మిలిటెంట్లకు నిధులిచ్చి వారికి శిక్షణ...
లాహోర్ లోని జోహార్ లో గత నెల 23 న జమాత్ ఉద్ దావా చీఫ్ హఫీజ్ సయీద్ ఇంటి వద్ద జరిగిన పేలుడు ఘటనకు ఇండియాయే కారణమని పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వి ఆరోపించారు. ఆ పేలుడులో నలుగురు మరణించగా సుమారు డజను మంది గాయపడ్డారు. మిలిటెంట్లకు నిధులిచ్చి వారికి శిక్షణ ఇవ్వడం ద్వారా ఇండియా పాక్ లో ఉగ్రవాద చర్యలకు ఊతమిస్తోందని ఆయన ఆక్రోశించారు. పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా.. ఇలాగే ఇండియాపై ఆరోపణ చేశారు. ఈ పేలుడు దాడికి, తమ దేశంలో ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్న ఇండియాకు లింక్ ఉందని ఆయన గత ఆదివారం ట్వీట్ చేశారు. ప్రపంచ దేశాలు ఈ ‘రోగ్ బిహేవియర్ పై అంతర్జాతీయ సంస్థలను సమీకరించి హైలైట్ చేయాల్సి ఉందన్నారు. అయితే టెర్రరిస్టు హఫీజ్ సయీద్ పేరును మాత్రం ఆయన ప్రస్తావించలేదు. నాడు ముంబై పేలుళ్ల సూత్రధారి అయిన ఈ టెర్రరిస్టును పాకిస్థాన్ ‘పెంచి పోషిస్తోంది’ రెండు సార్లు సయీద్ కి జైలు శిక్ష విధించినప్పటికీ అతడు ఇంటి నుంచే ఉగ్రవాద కార్యకలాపాలను నిర్వహిస్తున్నాడు.
పాక్ జాతీయ భద్రతా సలహాదారు మోయీద్ యూసుఫ్ కూడా ఈ పేలుడుకు ఇండియన్ ఇంటెలిజెన్స్దే బాధ్యత అని ఆరోపించాడు. ఈ విషయం ఇన్వెస్టిగేషన్ లో తేలిందన్నారు. రీసెర్చ్ అండ్ ఎనాలిసిన్ వింగ్ (రా) కి చెందిన ఓ వ్యక్తి ఈ పేలుడుకు సూత్ర దారి అని , అతడు ముమ్మాటికీ భారతీయుడేనని ఆయన చెప్పాడు. పేలుడుకు వాడిన పదార్థాలను ఎనాలిసిస్ కూడా చేసినట్టు యూసుఫ్ తెలిపారు.
మరిన్ని ఇక్కడ చూడండి :మెడలో నాగుపాము..సైకిల్ పై సవారీ..చుస్తే షాక్ అవుతారు..!వైరల్ అవుతున్న వీడియో..:snake on neck viral video.