Pakistan-Afghanistan: తాలిబన్ల హెచ్చరికలు.. ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్ళే విమానాలు నిలిపివేసిన పాకిస్తాన్! ఎందుకంటే..

పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఆఫ్ఘనిస్తాన్‌కు అన్ని విమానాలను నిలిపివేయాలని నిర్ణయించింది.

Pakistan-Afghanistan: తాలిబన్ల హెచ్చరికలు.. ఆఫ్ఘనిస్తాన్‌కు వెళ్ళే విమానాలు నిలిపివేసిన పాకిస్తాన్! ఎందుకంటే..
Pakistan Intenartional Airlines
Follow us

|

Updated on: Oct 15, 2021 | 9:09 AM

Pakistan-Afghanistan: పాకిస్తాన్.. ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ మధ్య సంబంధాలు ఉద్రిక్తంగా మారుతున్నాయి. పాకిస్తాన్ ప్రభుత్వ రంగ విమానయాన సంస్థ పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ (PIA) ఆఫ్ఘనిస్తాన్‌కు అన్ని విమానాలను నిలిపివేయాలని నిర్ణయించింది. గురువారం నుంచి ఈ నిర్ణయం అమలులోకి వచ్చింది. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమాన కార్యక్రలపాలను తాలిబన్లు నిరంతరం అద్దగిస్తున్నాయిఅని ఫిర్యాదులు వస్తున్నాయి. పాక్ ప్రభుత్వం కానీ, పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానాలు కానీ, తమ దేశంలోకి అడుగు పెట్టకూడదని తాలిబాన్ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.

ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లు ప్రత్యేకించి కాబూల్ విమానాశ్రయంలో పాకిస్తాన్ ఎయిర్‌లైన్స్ ఉద్యోగులను కలవరపరిచేందుకు సిబ్బందిని బెదిరించారు . అక్కడ ఉన్న తాలిబాన్ అధికారులు విమాన ఆపరేషన్‌లో జోక్యం చేసుకుంటున్నారు. విమాన కార్యకలాపాలను నిలిపివేయడానికి ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం ఇదే. ఒక మీడియా నివేదిక ప్రకారం, విమానాలకు టికెట్ ధరలను తగ్గించాల్సి ఉంటుందని తాలిబాన్లు పాకిస్తాన్‌కు చెప్పారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ క్లిష్ట సమయాలను సద్వినియోగం చేసుకుంటోందని, ఆగస్టు తర్వాత టిక్కెట్లు చాలా ఖరీదుగా మారిపోయాయనీ తాలిబాన్ ఆరోపించింది. అయితే పాకిస్తాన్ ధరలు తగ్గించడానికి సిద్ధంగా లేదు.

కొన్ని రోజుల క్రితం, ఒక తాలిబాన్ ప్రభుత్వ ప్రతినిధి వారు(పాకిస్తాన్ పాలకులు) ప్రజల నిస్సహాయత నుంచి ప్రయోజనం తీసుకున్నట్లు చెప్పారు. పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్, ఆఫ్ఘన్ ఎయిర్లైన్స్ ఆగస్టు నుంచి టికెట్ ధరలు మూడు రెట్లు పెంచేశాయి. సాధారణ ఆఫ్ఘని ఈ టికెట్ కొనలేరు. తాలిబన్లు చెప్పారు – టిక్కెట్లు చౌకగా ఇవ్వకపోతే, విమానాలు నిలిపివేస్తాము. ప్రస్తుతం, పాకిస్తాన్ నుండి పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ విమానాలు మాత్రమే రెగ్యులర్‌గా కాబూల్‌కు వస్తున్నాయి.

పాకిస్తాన్ ఆజ్ టీవీ ప్రకారం, తాలిబాన్ ఆరోపణలు , పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్ కాబూల్ నుండి ఇస్లామాబాద్ టిక్కెట్ల ధర 4 మిలియన్ పాకిస్తాన్ రూపాయలు. ప్రత్యేక విషయం ఏమిటంటే, ఆగస్టులో, అదే టికెట్ కేవలం 20,500 రూపాయలకు అందుబాటులో ఉంది. కేవలం 2 నెలల్లోనే టికెట్ రేటు అనేక రెట్లు పెరిగినట్లు స్పష్టంగా కనిపిస్తోంది . పాకిస్తాన్ ఇమ్రాన్ ప్రభుత్వం దీనిని నేరుగా సద్వినియోగం చేసుకుంటోంది. ఈ చర్యతో తాలిబాన్లకు కోపం వచ్చింది.

తాలిబాన్ ప్రభుత్వ వైఖరి చాలా కఠినంగా ఉంది. టిక్కెట్ ధర ఎక్కువగా వసూలు చేస్తే ప్రభుత్వాన్ని సంప్రదించమని కోరిన టోల్ ఫ్రీ నంబర్‌ను ప్రయాణికులకు ఇచ్చింది. ఆగస్టు 15 న కాబూల్‌లో తాలిబాన్ ఆక్రమణ తరువాత, ఖరీదైన టిక్కెట్లను కొనుగోలు చేయడం ద్వారా దాదాపు లక్ష మంది దేశం నుండి బయటకు వెళ్లారు.

Also Read: Dussehra 2021: పాల పిట్ట దర్శనంతో ముగిసే దసరా ఉత్సవాలు.. ఎందుకు దర్శిస్తారంటే..

Mysore Palace: అంగరంగ వైభవంగా మైసూర్‌ దసరా ఉత్సవాలు.. విద్యుత్ దీపాల కాంతులతో వెలిగిపోతున్న ప్యాలెస్‌

SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
SRH vs RCB: చెల్లుకు చెల్లు.. ప్రతీకారం తీర్చుకున్న బెంగళూరు..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..