అగ్నిపర్వతం పేలిన మూడు వారాల తర్వాత భూకంపం.. భవనాలపైకి లావా..  వీడియో

అగ్నిపర్వతం పేలిన మూడు వారాల తర్వాత భూకంపం.. భవనాలపైకి లావా.. వీడియో

Phani CH

|

Updated on: Oct 15, 2021 | 8:48 AM

స్పానిష్ ద్వీపమైన లా పాల్మా ద్వీపంలో అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన మూడు వారాల తర్వాత అక్టోబరు 10న భూకంపం వచ్చింది. ఈ భూకంప తీవ్రత రీక్టర్ స్కేల్‎పైన 3.8 గా నమోదయిందని స్పానిష్ నేషనల్ జియోలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐఎన్‌జీ తెలిపింది.

స్పానిష్ ద్వీపమైన లా పాల్మా ద్వీపంలో అగ్నిపర్వతం విస్ఫోటనం జరిగిన మూడు వారాల తర్వాత అక్టోబరు 10న భూకంపం వచ్చింది. ఈ భూకంప తీవ్రత రీక్టర్ స్కేల్‎పైన 3.8 గా నమోదయిందని స్పానిష్ నేషనల్ జియోలాజికల్ ఇనిస్టిట్యూట్ ఐఎన్‌జీ తెలిపింది. మాజో, ఫ్యూన్కాలియంట్. ఎల్ పాసో గ్రామాల్లో భూకంపం వచ్చినట్లు తెలిపింది. కుంబ్రే వైజా అగ్నిపర్వతం వైపు నుంచి ఎర్రటి వేడి శిలాద్రవం ప్రవహిస్తూ భవనాల వైపు వచ్చిందని స్పానిష్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ జియాలజీ అండ్ మైనింగ్ తెలిపింది. స్పానిష్ నావికాదళం అగ్నిపర్వత బూడిదను శుభ్రం చేయడంలో సహాయపడుతున్నారని స్పెయిన్ రక్షణ మంత్రి మార్గరీట రోబల్స్ చెప్పారు. లావా వేడి 1,240 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలతో టోడోక్ గ్రామం శివారులో ఉన్న కొన్ని భవనాలను ధ్వంసం చేసిందని కానరీ దీవుల అగ్నిపర్వత సంస్థ సోషల్‌మీడియాలో తెలిపింది. అగ్నిపర్వతం సమీపంలో పాక్షిక కోన్ కూలిపోయిందని ING ప్రతినిధి స్టావ్రోస్ మెలెట్లిడిస్ రాయిటర్స్‌తో అన్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: యాభైయ్యేళ్ల క్రితం పోయిన ఫర్స్‌.. ఇప్పడు దొరికింది.. ఓపెన్‌ చేసి చూస్తే షాక్‌.. వీడియో

Viral Video: ఈ చిలుక చూడండి.. అప్పడే పుట్టిన తన పిల్లల్ని ఎలా పలకరిస్తుందో..! వీడియో