Bill Clinton: అమెరికా మాజీ అధ్యక్షుడికి అస్వస్థత.. బిల్ క్లింటన్‌కు ఐసీయూలో చికిత్స..
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. అమెరికన్ ప్రతినిధి ఈ సమాచారాన్ని వెల్లడించారు. మంగళవారం ఓ ప్రయివేటు...

అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ అస్వస్థతకు గురయ్యారు. అమెరికన్ ప్రతినిధి ఈ సమాచారాన్ని వెల్లడించారు. మంగళవారం ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరైన క్లింటన్.. స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తన సిబ్బందికి చెప్పాడు. దీంతో మాజీ అధ్యక్షుడిని చికిత్స నిమిత్తం కాలిఫోర్నియాలోని ఇర్విన్ మెడికల్ సెంటర్‌లో చేర్పించి, చికిత్స అందిస్తున్నారు. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కారణంగా బిల్ క్లింటన్ మెడికల్ సెంటర్ ఐసీయూలో చేరారు. అతని వైద్యులు ఇర్విన్ మెడికల్ సెంటర్‌లో మెడిసిన్ ప్రెసిడెంట్ డాక్టర్ అల్పేష్ అమిన్ సంయుక్త ప్రకటన ప్రకారం.. ” వైద్యుల పర్యవేక్షణనలో ICU లో చేరారని IV యాంటీబయాటిక్స్, ఫ్లూయిడ్స్ ఇస్తున్నట్లుగా వెల్లడించారు.
బిల్ క్లింటన్ వ్యక్తిగత వైద్యుడు డాక్టర్ లిసా బార్డాక్, క్లింటన్ ఐసియులో చేరారని..భద్రత కారణాల దృష్య్టా ఆ వివరాలను అందించలేకపోతున్నట్లుగా తెలిపారు. అతను ప్రస్తుతం బాగున్నారు.. కుటుంబ సభ్యులతోపాటు ఉద్యోగులతో మాడినట్లుగా తెలిపారు. కాలిఫోర్నియా వైద్య బృందం న్యూయార్క్‌లో ప్రెసిడెంట్ వైద్య బృందంతో నిరంతరం సంప్రదిస్తూ ఉంటుంది. అతను త్వరలో ఇంటికి వెళ్తాడని మేము ఆశిస్తున్నాము.
క్లింటన్‌కు 2004లో బైపాస్ హార్ట్ సర్జరీ నిర్వహించారు. 2010లో రెండు స్టెంట్లు కూడా వేశారు. కానీ ఆయనకు ఎలాంటి గుండె సమస్య కానీ, కొవిడ్ ఇన్‌ఫెక్షన్ కానీ లేదని డాక్టర్లు స్పష్టం చేశారు. 1993 నుంచి 2001 మధ్య అమెరికాకు 42వ ప్రెసిడెంట్‌గా బిల్ క్లింటన్ సేవలందించారు.
“Former US President Bill Clinton has been admitted to a hospital in Irvine California,” reports Reuters
(file photo) pic.twitter.com/rCrLKdrcKz
— ANI (@ANI) October 15, 2021
బిల్ క్లింటన్ 1993 నుండి 2001 వరకు యునైటెడ్ స్టేట్స్ 42 వ అధ్యక్షుడిగా పనిచేశారు. 2001 లో క్లింటన్ వైట్ హౌస్ నుంచి వెళ్లిపోయినప్పటి నుండి మాజీ అధ్యక్షుడు ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. సుదీర్ఘ ఛాతీ నొప్పి, శ్వాసలోపం కారణంగా 2004 లో అతను క్వాడ్ బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. 2005 లో బిల్ క్లింటన్ పాక్షిక ఊపిరితిత్తుల శస్త్రచికిత్స కోసం ఆసుపత్రికి వెళ్లారు. తర్వాత 2010 లో అతని కొరోనరీ ఆర్టరీలో ఒక జత స్టెంట్‌లు ఉంచబడ్డాయి.
ఇవి కూడా చదవండి: RK: పోలీసులు చెబుతుంటే తెలిసింది తప్ప.. పార్టీ నుంచి సమాచారం రాలేదు.. కుటుంబ సభ్యుల కామెంట్..
Dasara – Jimmy: దసరా రోజున జమ్మి చెట్టును ఇలా పూజిస్తే.. కుబేరుడు మీ ఇంట్లో..
