RK: పోలీసులు చెబుతుంటే తెలిసింది తప్ప.. పార్టీ నుంచి సమాచారం రాలేదు.. కుటుంబ సభ్యుల కామెంట్..

ఆర్కే మృతిపై ఆయన తోడల్లుడు విరసంనేత కళ్యాణ్ రావు స్పందించారు. మీడియా ద్వారా పోలీసులు చెబుతుంటే తెలిసింది తప్ప.. అధికారికంగా పార్టీ నుండి ఎటువంటి సమాచారం..

RK: పోలీసులు చెబుతుంటే తెలిసింది తప్ప.. పార్టీ నుంచి సమాచారం రాలేదు.. కుటుంబ సభ్యుల కామెంట్..
Rk
Follow us

|

Updated on: Oct 15, 2021 | 7:38 AM

మావోయిస్ట్ దళానికి కోలుకోలేని దెబ్బ తగిలింది. మావోయిస్టు అగ్రనేత ఆర్కే, అలియాస్‌ అక్కిరాజు హరగోపాల్‌ అనారోగ్యంతో మృతి చెందారు. ఈ విషయాన్ని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అధికారికంగా ధృవీకరించారు. అంత్యక్రియలు కూడా పూర్తైనట్లు ప్రకటించారు. 21 మందితో ప్రకటించిన కేంద్ర కమిటీలో ఉన్నారు ఆర్కే. చాలా ఎన్‌కౌంటర్లలో ఆర్కే తృటిలో తప్పించుకున్నారు. గత ఏడాది జులైలో కూడా ఏవీబీలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆర్కే తప్పించుకున్నట్లు పోలీసులు చెప్తున్నారు.

ప్రకాశం జిల్లాకు చెందిన ప‌ద్మజ‌ను ఆర్కే వివాహం చేసుకున్నారు. ఆమె కూడా ఆర్కేతో పాటు ఉద్యమంలో ప‌నిచేశారు. ఉద్యమం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ ఆమె టీచ‌ర్‌గా ప‌నిచేశారు. ఆమెపై కూడా ప‌లు కేసులు ఉన్నాయి. ఆర్కే తండ్రి టీచ‌ర్‌గా ప‌నిచేశారు.  ఆర్కే సోదరుడు కూడా నిర్దారించుకోలేక పోతున్నారు. తమకు ఎలాంటి సమాచారం రాలేదని వెల్లడించారు.

ఆర్కే మృతిపై ఆయన తోడల్లుడు విరసంనేత కళ్యాణ్ రావు స్పందించారు. మీడియా ద్వారా పోలీసులు చెబుతుంటే తెలిసింది తప్ప.. అధికారికంగా పార్టీ నుండి ఎటువంటి సమాచారం మాకు ఇంతవరకు అందలేదన్నారు. అధికారికంగా పార్టీ నుండి స్పష్టమైన సమాచారం రాలేదన్నారు.

40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో..

అక్కిరాజు హరగోపాల్ అలియాస్ ఆర్కే. 40 ఏళ్లుగా మావోయిస్టు ఉద్యమంలో కీలక పాత్ర. ఉన్నత విద్యావంతుడు కావడంతో అతి తక్కువ టైమ్‌లోనే ఎదిగాడు. కేంద్ర కమిటీలోనూ చోటు సంపాదించాడు.. పార్టీ నిర్మాణంలో ఆయనదే కీ రోల్. ఉద్యమంలో ఎదురుదెబ్బలు తగిలినప్పుడు.. పార్టీ ఒడిదొడుకులకు లోనైనప్పుడు కూడా నిలబడ్డారు.

నక్సలిజానికి ఊపిరులూదింది..

1979లో జగిత్యాల జైత్రయాత్ర తెలుగు గడ్డపై నక్సలిజానికి ఊపిరులూదింది. ఉమ్మడి ఏపీలో పీపుల్స్‌వార్‌ పార్టీగా కొండపల్లి సీతరామయ్య నాయకత్వంలో అవతరించింది. అప్పటి నుంచి ఏపీతోపాటు మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్, బీహార్, తమిళనాడు ఇలా ఒక్కో రాష్ట్రానికి విస్తరించింది..పీపుల్స్‌వార్‌ పార్టీ.. సెప్టెంబర్‌ 21, 2004న బిహార్‌కు కమ్యూనిస్టు సెంటర్‌ మావోయిస్టు దళాన్ని విలీనం చేసుకుంది. అప్పటి నుంచి మావోయిస్టు పార్టీగా అవతరించింది. 2004లో ప్రభుత్వంతో శాంతి చర్చలు జరుపుతుండగానే నక్సల్స్‌ అగ్రనేతలు రామకృష్ణ, సుధాకర్‌ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు.. ఇకపై పీపుల్స్‌వార్‌ పార్టీ మావోయిస్టు పార్టీగా కొనసాగుతుందని ప్రకటించారు. అయితే ప్రభుత్వంతో జరిపిన చర్చలు విజయవంతం కాలేదు.. ఇక ఆరోజు నుంచి ఈ రోజు వరకు..

ఇవి కూడా చదవండి: Modi Government: దసరా పండుగ వేళ రైతులకు గుడ్ న్యూస్ చెప్పిన కేంద్రం…

Amit Shah: మరోసారి సర్జికల్‌ స్ట్రయిక్స్‌ తప్పవు.. పాకిస్తాన్‌కు గట్టి వార్నింగ్‌ ఇచ్చిన హోంమంత్రి అమిత్ షా