US Jobs: అమెరికాలో కొత్త పోకడ.. ఉన్న ఉద్యోగాలు వదులుకుని కొత్త కొలువుల కోసం వెతుకులాట.. ఎందుకంటే..?
US Emplyment News: కరోనా జీవితాన్ని వెంటాడుతోన్న పెను భూతం.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మారి. క్రీశ్తు శకం, క్రీశ్తు ముందు కాదు.. కరోనాకు ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి.
US Emplyment News: కరోనా జీవితాన్ని వెంటాడుతోన్న పెను భూతం.. ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న మహమ్మారి. క్రీశ్తు శకం, క్రీశ్తు ముందు కాదు.. కరోనాకు ముందు కరోనా తర్వాత అని చెప్పుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. తాజాగా అమెరికాలో జరుగుతున్న పరిణామాలు మరింత ఆందోళన కరంగా మారాయి. కరోనా ప్రభావంతో.. అయిన వారిని పోగొట్టుకున్నాం. అందరి జీవితాలు ఆర్ధింగా చితికిపోయాయి. అందరికీ కొత్త గుణపాఠం నేర్పింది. భయంకర కోణాలను చూపించింది. ఆదాయం పడిపోయి దాదాపు అన్ని కంపెనీలు కాస్ట్ కటింగ్ ఫార్ములా అప్లై చేశాయి. సంస్థల్లో ఏళ్ల తరబడి నమ్మకంగా పని చేసిన వారిపైనా కొన్ని సంస్థలు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించాయి. సుదీర్ఘమైన షిఫ్టులు వేయడమే కాకుండా.. వీక్లీ ఆఫ్ లు, సెలవులు రద్దు చేశాయి. అంతేకాకుండా శాలరీల్లోనూ భారీగా కోతలు విధించాయి.
ఇప్పుడు ఆర్ధిక రంగం మెళ్లిగా పుంజుకోవడంతో.. కంపెనీలు ఆకర్షణీయ వేతనాలు, ప్యాకేజీలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. కానీ పని చేసేందుకు ఉద్యోగులు ముందుకు రావడం లేదు. ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసి.. సరికొత్త ఉద్యోగాలను వెతుక్కునే పనిలో పడ్డారు. ఒక్క అమెరికాలోనే ఆగస్టులో 43 లక్షల మంది తమ ఉద్యోగాలకు రాజీనామా చేశారు. ఇది ఆ దేశ మొత్తం ఉద్యోగాల్లో 2.9 శాతంగా ఉంది. 50 శాతం మంది కొత్త ఉద్యోగాల కోసం వేట మొదలు పెట్టారు. అమెరికా లేబర్ డిపార్ట్ మెంట్ స్వయంగా ఈ డేటాను వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మంది ఉద్యోగులు కంపెనీలు మారటంపై గానీ, రాజీనామాలపై గానీ ఆలోచిస్తున్నారని ఓ సర్వేలో తేలింది.
ముఖ్యంగా రిటైల్, రెస్టారెంట్లు, హెల్త్‌కేర్, సోషల్ అసిస్టెన్స్ రంగాల్లో రికార్డు స్థాయిలో ఉద్యోగులు రాజీనామాలు చేస్తున్నట్లు బ్యూరో ఆఫ్ లేబర్ స్టాటిస్టిక్స్ చెబుతున్నాయి. తక్కువ వేతనాలకు పనిచేస్తున్న ఉద్యోగులు తమ కంపెనీలకు గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇప్పటికే ఉన్న నిరుద్యోగానికి తోడు కొత్తగా ఈ రాజీనామాల సంక్షోభం మొదలైంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే మున్ముందు మరిన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో పారిశ్రామిక వర్గాల్లో ఆందోళన మొదలైంది.
Also Read..
Apple Side Effects: యాపిల్స్ ఎక్కువగా తింటున్నారా ?… అయితే జాగ్రత్త.. ప్రమాదం మీ చెంతనే..