BEL Recruitment: భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు.. అర్హులెవరు.? ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..
BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పంచకుల యూనిట్‌లో ఈ ఖాళీలను...
BEL Recruitment 2021: భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్)లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. పంచకుల యూనిట్‌లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. కాంట్రాక్ట్ విధానంలో తీసుకోన్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తంం 88 ఖాళీలు భర్తీ చేయనున్నారు.
* వీటిలో ట్రెయినీ ఇంజనీర్లు 55 కాగా,ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులు 33 ఉన్నాయి.
* ఎలక్ట్రానిక్స్, మెకానికల్ విభాగాల్లో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో నాలుగేళ్ల ఫుల్ టైం బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి.
* వీటితో పాటు పని అనుభవం తప్పనిసరిగా ఉండాలి.
* అభ్యర్థుల వయసు 01.10.2021 నాటికి ట్రెయినీ ఇంజనీర్లకు 25ఏళ్లు, ప్రాజెక్ట్ ఇంజనీర్ పోస్టులకు 28ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను బీఈ/బీటెక్‌లో సాధించిన మార్కులు, అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
* ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదిగా 27-10-2021ని నిర్ణయించారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: దసరా సంబరాల్లో మరో ఘోరం.. భక్తులపై నుంచి దూసుకెళ్లిన కారు.. నలుగురు మృతి..
Ramarao On Duty: రొమాంటిక్ మూడ్ లో’ రామారావు’.. మాస్ రాజా మూవీనుంచి అదిరిపోయే పోస్టర్..